అన్న‌య్య అనే హోదాలోనే చిరు ఉండేందుకు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారు.ఆ హోదాను దాటి ఉండేందుకు ఆయ‌న పెద్ద‌గా ప్ర‌య‌త్నించ‌రు. అవును! అన్న‌య్య అన్న పిలుపున‌కు సంబంధించి పెన‌వేసుకున్న ఆత్మీయత‌కు మించిన పెద్ద బంధం పెద్ద పదం ఏముంద‌ని భావిస్తారు.చాలా రోజులుగా అనుకుంటున్న ఈ భేటీతో అటు అన్న‌య్య ఇటు వైఎస్ జ‌గ‌న్  ఇరువురూ కాసేపు అన్ని విష‌యాల‌పై కూల‌కుషంగా చ‌ర్చించుకుని,ఓ అంగీకారానికి కొన్ని విష‌యాల‌పై రానున్నార‌ని కూడా తెలుస్తోంది.ఈ భేటీలో ఎన్నిక‌ల విష‌య‌మై కానీ రాజకీయాల‌పై కానీ చ‌ర్చ జ‌రుగుతుందా లేదా అన్న‌ది అప్పుడే చెప్ప‌లేం అని మెగాభిమానులు అంటున్నారు.జ‌న‌సేన మాత్రం కాస్త క‌ల‌వ‌ర‌ప‌డుతోంది. అప్పుడే ట్రోల్స్ కూడా మొద‌లుపెట్టేసింది.జ‌గ‌న్ కు వ్య‌తిరేకంగా ట్రోల్స్ చేస్తూ..ఈ ప‌రిణామాల‌ను రాజ‌కీయంగా వైసీపీ వాడుకోకుండా జాగ్ర‌త్త వ‌హిస్తోంది.కేవ‌లం త‌మ హీరో ఇండ‌స్ట్రీ త‌ర‌ఫున ప్ర‌తినిధిగానే వెళ్లారే త‌ప్ప, వైసీపీకి మ‌ద్ద‌తుగా ముందున్న కాలంలో ఉండేందుకు ఎంత మాత్రం కాద‌ని కూడా అంటున్నారు మెగాభిమానులు. ఇక భేటీ అయ్యాక చిరు ఏమంటారు? 
ఏ విష‌యాల‌పై ఇండ‌స్ట్రీ  కోరుకుంటున్న విధంగా స్ప‌ష్ట‌త రానుంది? ఇవి కూడా ఇప్పుడిక ఆస‌క్తిదాయ‌క ప్ర‌శ్న‌లు.

ఈ త‌రుణంలో ఈ నేప‌థ్యంలో
గ‌న్నవ‌రం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.ఇండ‌స్ట్రీ పెద్ద‌గా కాదు బిడ్డ‌గానే ఇక్క‌డికి వ‌చ్చాను అని, త‌మ రాక వెనుక ఆంత‌ర్యం ఇదేన‌ని స్ప‌ష్టంచేశారు.ఏపీ సీఎం జ‌గ‌న్ తో భేటీ అయిన అనంత‌రం మ‌రిన్ని విష‌యాలు వెల్ల‌డిస్తాన‌ని అన్నారు.ఇక టికెట్ ధ‌ర‌ల‌కు సంబంధించి ఏం జ‌ర‌గ‌నుంది? ఎంత మేరకు ఈ నిర్ణ‌యంపై ప్ర‌భావం ఉండ‌నుంది అన్న విష‌యాల‌పై మ‌రోమారు స‌మీక్షించి ఇరువురూ చ‌ర్చించి ఓ నిర్ణ‌యానికి రానున్నార‌న్న‌ది మాత్రం సుస్ప‌ష్టం.ఇక సీఎం ఇంటికి చేరుకున్న చిరును సాద‌రంగా ఆహ్వానించారు జ‌గ‌న్.అదేవిధంగా జ‌గ‌న్ ను స‌న్మానించి, పుష్ప గుచ్ఛం అందించి సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలిపారు. తెలుగువాడిగా,అంద‌రి మేలు కోరుకునే వాడిగా,అంద‌రి ఆత్మీయ‌త‌లు అందుకున్న‌వాడిగా తాను ఇరు రాష్ట్రాల‌కూ మేలు జ‌ర‌గాల‌నే కోరుకుంటున్నాన‌ని మ‌రో మారు చిరు స్ప‌ష్టం చేశార‌ని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: