గోనె ప్రకాశ్ రావు...రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు. రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరికీ గోనె గురించి ఐడియా ఉంటుందనే చెప్పాలి. ఒకప్పుడు కాంగ్రెస్‌లో కీలకంగా ఉంటూ...వైఎస్సార్‌తో సన్నిహితంగా ఉండేవారు. అలాగే వైఎస్సార్ కోసం కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత విభేదాలకు సైతం చెక్ పెట్టేవారు. ఇలా వైఎస్సార్ కోసం పనిచేసిన గోనె...తర్వాత జగన్ వెంట నడిచారు. వైఎస్సార్ చనిపోవడంతో జగన్ పెట్టిన వైసీపీలోకి వచ్చి...తెలంగాణలో కీలక నేతగా పనిచేశారు.

అయితే తెలంగాణలో వైసీపీ కనుమరుగు కావడంతో గోనె రాజకీయాల నుంచి కనుమరుగయ్యారు. సొంత వ్యాపారాలు చూసుకునే పనిలో బిజీ అయ్యారు. మరి ఏం అనుకున్నారో తెలియదు గానీ...ఇటీవల మళ్ళీ రాజకీయాల్లో కనిపిస్తున్నారు. ఓ రాజకీయ విశ్లేషకుడు అవతారం ఎత్తి..రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకు వ్యతిరేకంగా ముందుకెళుతున్నారు. ఎక్కువగా ఈయన తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌ని టార్గెట్ చేసి ముందుకెళుతున్నారు.

టీఆర్ఎస్‌ని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మరి ఎవరికి లబ్ది చేకూరాలని చేస్తున్నారో తెలియదు గానీ...ముందు కేసీఆర్‌ని మాత్రం ఇరుకున పెట్టాలని చూస్తున్నారు. ఆ మధ్య ఆదిలాబాద్ కలెక్టర్‌తో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇలా కలెక్టర్‌నే టార్గెట్ చేసి గోనె వార్తల్లోకి ఎక్కారు. అలాగే హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్‌కు మద్ధతుగా మాట్లాడారు.

తాజాగా కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టార్గెట్‌గా గోనె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్ జిల్లాల ఎమ్మెల్యేల అవినీతి, అరాచకాలు పెరిగిపోయాయని అన్నారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు భూకబ్జాలు, ఇసుక అక్రమ రవాణా లాంటి అక్రమాలకు యథేచ్ఛగా తెగబడుతున్నారని, ఆ అక్రమాలని ఆధారాలతో సహ నిరూపిస్తానని, ఇప్పటికైనా అక్రమాలు చేయడం ఆపాలని వార్నింగ్ ఇచ్చారు. ఇలా ఎక్కడకక్కడ గోనె టీఆర్ఎస్‌ని టార్గెట్ చేసుకుని ముందుకెళుతున్నారు. గోనె ప్రభావం వల్ల కొందరు కారు ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నట్లు కనిపిస్తున్నారు. మొత్తానికి గోనె..టీఆర్ఎస్‌ని గట్టిగానే టార్గెట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: