అమరావతి : ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయిన సంగతి తెల్సిందే.  అయితే ఈ సమావేశం అనంతరం టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి మీడియా తో మాట్లాడారు.  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  తో సంతృప్తికరంగా సమావేశం జరిగిందన్నారు మెగాస్టార్ చిరంజీవి.  గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు కొలిక్కి రాకుండా ఉన్నాయన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇండస్ట్రీ వాయిస్ కూడా వినాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  నన్ను ఆహ్వానించారని,.. ఇండస్ట్రీ, ఎగ్జిబిటర్ల సాధక బాధలు వివరించామని చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. 

అన్ని సానుకూలంగా ఆలకించారని.. సినీ ఇండస్ట్రీ విషయంలో జగన్ స్పందన సంతృప్తి నిచ్చిందని స్పష్టం చేశారు మెగాస్టార్ చిరంజీవి.  పైకి కన్పించినంత గ్లామరుగా సినీ ఫీల్డ్ ఉండదని.. రెక్కాడితే కాని డొక్కాడని పేదలు ఇండస్ట్రీని నమ్ముకుని ఉన్నారన్నారు మెగాస్టార్ చిరంజీవి. థియేటర్ల యజమానులకూ అనేక బాధలు ఉన్నాయని.. హాళ్లని మూసేస్తేనే బెటరే భావనకు కొందరు థియేటర్ యజమానులు ఉన్నారని చెప్పారు మెగాస్టార్ చిరంజీవి.  అన్ని రకాలుగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటామని జగన్ చెప్పారన్నారు మెగాస్టార్ చిరంజీవి. 

టిక్కెట్ ధరలపై జారీ చేసిన జీవోను జగన్ పునః పరిశీలిస్తామన్నారన్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రతి ఒక్కరూ సంయమనం తో ఉండాలి... ఐదో షో వేసుకునే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తామన్నారన్నారు మెగాస్టార్ చిరంజీవి.  ఈ సమావేశం వివరాలను సినీ ఇండస్ట్రీ లోని చిన్నా పెద్దలకు కూడా తెలియ చేస్తానను పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి. అందరికీ ఆమోద యోగ్యం గా ఉండే నిర్ణయం వస్తుం దని ఆశిస్తున్నాను... మరో సారి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  తో భేటీ అవుతానని స్పష్టం చేశారు మెగాస్టార్ చిరంజీవి.

మరింత సమాచారం తెలుసుకోండి: