కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు రైతుల మేలు కోరి తెలంగాణ లో అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తుందని విమర్శించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.  మూడు నెలల కాలంలో 50 శాతం ఎరువుల ధరలు పెంచి రైతు పెట్టుబడిని పెద్ద ఎత్తున పెంచిన కేంద్రం వెంటనే ముఖ్యమంత్రి గారి అభ్యర్థన మేరకు ధరలు తగ్గించకుంటే అడుగడుగునా బీజేపీ నేతలను అడ్డుకుంటామని హెచ్చరించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇప్పటికే వరుసగా పెట్రోల్,డీజల్ ధరలు పెంచుతూ పోతూ రైతులతో పాటు,సామాన్య ప్రజలను ఇబ్బందులు గురిచేస్తున్న కేంద్రం...  గ్యాస్ ధర గుది బండ గా మారింది..నిత్యావసర ధరలు  పెంచుకుంటూ పోతూ ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నదని అగ్రహించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.  

రైతు కల్లాల దగ్గర వెళ్లి తెలంగాణ ప్రభుత్వం పంట కొనుగోలు చేస్తే నల్లా చట్టాలు తెచ్చి కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైతుల ప్రాణాలు తీసింది...  కేంద్రం చిల్లి గవ్వ ఇవ్వకున్న మూడేళ్ళ కాలంలో ప్రపంచంలో నే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం కట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.  మిషన్ కాకతీయ తో భూగర్భ జలాలు పెరిగి చెరువులు,కుంటలు బోరు బావులు పెద్ద ఎత్తున జలకళ సంతరించుకున్నాయని..  రైతును రాజు చేయటానికి,రాష్ట్రం లో సమస్యలు లేకుండా చేయటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచిస్తుంటే..కేంద్రం ఎలాంటి సహకారం అందివ్వటం లేదని పేర్కొన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.  

తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడి ఇచ్చి రైతును ఆదుకోవాలని చూస్తుంటే....కేంద్రం మాత్రం రైతు పెట్టుబడిని పెంచుతుంది...  దేశ,రాష్ట్ర రైతుల పక్షాన ముఖ్యమంత్రి గారు ప్రధానికి ఉత్తరం రాసారు...రాష్ట్ర బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం మెడలు వంచి ఎరువుల ధరలు తగ్గించేలా చూడాలన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.  రాష్ట్ర బీజేపీ నేతలు అవాకులు,చెవాకులు మాట్లాడుతున్నారు..వడ్లు కొనుగోలు చేయమంటే సప్పుడు చేయరు...అనవసర రాజకీయాలు చేస్తారని..  గ్రామ స్థాయి నుండి పార్టీ శ్రేణులు బీజేపీ నేతలను ఎక్కడిక్కడ అడ్డుకుంటాయన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: