ప్రగతి భవన్లో వరసపెట్టి భేటీలు నిర్వహిస్తున్న కేసీయార్ కు బొమ్మ చూపించినట్లు సమాచారం. ముందు లెఫ్ట్ పార్టీల జాతీయ నేతలతో ను తాజాగా ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ తో ను కేసీయార్ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ రెండు సమావేశాలు కూడా ఏమంతా సానుకూలంగా జరగలేదని సమాచారం. ముందు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారామ్ ఏచూరితో సమావేశమయ్యారు. ఆ తర్వాత సీపీఐ జాతీయ స్ధాయి నేత డీ రాజాతో భేటీ అయ్యారు.




వీళ్ళ భేటీ తర్వాత సీతారామ్ మీడియాతో మాట్లాడినపుడు పొత్తుల ప్రస్తావన వచ్చింది. సీతారమ్ సమాధానమిస్తు పరిస్దితులను బట్టి పొత్తు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అంతేకానీ కేసీయార్ తో చర్చలు బాగా జరిగాయని కానీ కేసీయార్ ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు కూడా చెప్పలేదు. ఇదే విషయమై తెలంగాణా కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతు బీజేపీ విషయంలో కేసీయార్ వైఖరి సరిగా లేదని ఘాటుగానే స్పందించారు.




తాజాగా తేజస్వితో భేటీ సందర్భంగా జాతీయస్ధాయిలో ఎన్డీయేయేతర ఫ్రంట్ ఉండాలంటే కాంగ్రెస్ సహకారం లేకుండా సాధ్యం కాదని తేల్చిచెప్పారట. బీజేపీకి వ్యతిరేకంగా కేసీయార్ పనిచేస్తే తమ పార్టీ మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారట. అయితే కండీషన్స్ అప్లై అన్నట్లు కాంగ్రెస్ సహకారం ఉంటేనే అని చెప్పారట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కాంగ్రెస్ తో చేతులు కలపటం కేసీయార్  కు ఇష్టంలేదు. కారణం ఏమిటంటే లోకల్ పరిస్ధితుల కారణంగానే.




ఇంతకుముందు కూడా మమతబెనర్జీ, నవీన్ పట్నాయక్, స్టాలిన్ తో కేసీయార్ భేటీ అయిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా వాళ్ళనుండి సానుకూల స్పందన రాలేదని సమాచారం. కారణం ఏమిటంటే కేసీయార్ కున్న క్రెడిబులిటీనే. ఏరోజు ఎవరితో కేసీయార్ ఎలా వ్యవహరిస్తారో కూడా ఎవరికీ అర్ధంకారు. ఏమాత్రం స్ధిరత్వం లేని నేతంటే ముందు కేసీయారే గుర్తుకొస్తారు. అందుకనే కేసీయార్ అడుగులు ముందుకు పడటంలేదు. మొత్తంమీద గతంలో భేటీలే కాదు తాజా భేటీలు కూడా ఏమంత ఫ్రూట్ ఫుల్ గా లేదని అర్ధమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: