పొరుగున ఉన్న చిన్న దేశమైన తైవాన్ ను ఆక్రమించుకునేందుకు చైనా గత కొన్ని నెలల నుంచి ఎన్నో రకాల కుట్రలు పన్నుతోంది. ఒకవైపు అగ్రరాజ్యమైన అమెరికా మేము తైవాన్ కు అండగా ఉన్నామని తైవాన్ జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ హెచ్చరించినప్పటికీ అమెరికా మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చైనా సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు రోజురోజుకు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణంలో యుద్ధం జరుగుతుందో అన్న విధంగానే మారిపోయింది ప్రస్తుతం తైవాన్ చైనా సరిహద్దుల్లో పరిస్థితి. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో చైనా తైవాన్ పై యుద్ధానికి దిగబోతోంది అంటూ నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు.



 ఇలాంటి సమయంలో అటు అమెరికా తైవాన్ ను అన్ని రకాల సహాయ  సహాయ సహకారాలు అందిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమ దేశానికి సంబంధించిన ఎంతో అద్భుతమైన ఎఫ్ 16  యుద్ధ విమానాన్ని కూడా తైవాన్ కు ఇచ్చింది అమెరికా. ఈ క్రమంలోనే తైవాన్ చైనా సరిహద్దుల్లో అమెరికా ఎఫ్ 16  యుద్ధ విమానాలను మొహరిస్తూ అటు చైనా కు హెచ్చరికలు జారీ చేస్తూ ఉండటం గమనార్హం.  ఇక ఇటీవల కాలంలో అమెరికాకు సంబంధించిన 50 వేల మంది సైనికులు అటుచైనా సరిహద్దుల్లో తైవాన్కు ట్రైనింగ్ ఇస్తూ యుద్ధ విన్యాసాలు చేయిస్తూ ఉన్నారు.


 ఇలాంటి సమయంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. అమెరికా కు సంబంధించిన ఎఫ్ 16 యుద్ధ విమానం మీద నమ్మకంతో అద్భుతమైన సామర్థ్యం కలిగిన యుద్ధ విమానం మా దగ్గర ఉంది అంటూ చైనాకు హెచ్చరికలు జారీ చేస్తుంది తైవాన్. కాని తైవాన్ ఎంతగానో నమ్మకం ఉంచుకున్న ఎఫ్ 16 యుద్ధ విమానం ఇటీవలే యుద్ధ విన్యాసాలు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇలా ఎంతో అద్భుతం అంటూ చెప్పుకుంటున్న యుద్ధ విమానం కుప్ప కూలిపోవడంతో తైవాన్ కు షాక్ తగిలింది. దీంతో తమను భయపెట్టేందుకు తైవాన్ చేస్తున్న యుద్ధ విన్యాసాల్లో ఇక ఏకంగా అమెరికాకు చెందిన అత్యద్భుతమైన ఎఫ్ 16 కుప్పకూలడంతో చైనా ఒక్కసారిగా నవ్వుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: