తెలుగుదేశం పార్టీలో కమ్మ సామాజికవర్గం హవా ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఉండటానికి తక్కువ సంఖ్యలోనే ఉన్నా సరే కమ్మ వర్గం వారు రాజకీయంగా బలంగా ఉంటారు...అందుకే ఎక్కువ నియోజకవర్గాల్లో వారి ప్రభావమే ఎక్కువ ఉంటుంది. ముఖ్యగా కృష్ణా-గుంటూరు లాంటి జిల్లాల్లో కమ్మ వర్గం హవా ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. రెండు జిల్లాల్లో మెజారిటీ నియోజకవర్గాలు వారి చేతుల్లోనే ఉన్నాయి.

అలాగే వారి ఇతర వర్గాల చేతుల్లో నియోజకవర్గాల్లో వారి హవా ఎక్కువగానే ఉంది. ఒకసారి కృష్ణా జిల్లా విషయానికొస్తే...ఇక్కడ 16 సీట్లు ఉండగా అందులో 5 నియోజకవర్గాల బాధ్యతలని కమ్మ నేతలు చూసుకుంటున్నారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ ఉన్నారు. ఇక పెనమలూరులో బోడే ప్రసాద్, గుడివాడలో రావి వెంకటేశ్వరరావు, మైలవరంలో దేవినేని ఉమాలు ఇంచార్జ్‌లుగా ఉన్నారు. ఇక విజయవాడ వెస్ట్ బాధ్యతలు కేశినేని నాని చూసుకుంటున్నారు.

ఇక ఇవే కాదు ఇతర వర్గాల నేతల చేతుల్లో ఉన్న నియోజకవర్గాల్లో కూడా కమ్మ నేతల హవా ఉంది. గన్నవరం, నూజివీడు, తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ లాంటి నియోజకవర్గాల్లో కమ్మ నేతల హవా ఎక్కువే. అందుకే ఇప్పుడు రెండు నియోజకవర్గాల్లో కమ్మ వర్గం..బీసీ నేతలకు చుక్కలు చూపిస్తుంది. ఇక వారిని ఇంచార్జ్‌లు మార్చాలని గట్టిగానే డిమాండ్ చేస్తుంది. గన్నవరంలో వల్లభనేని వంశీ టీడీపీని వదిలిపెట్టాక ఇంచార్జ్‌గా బీసీ వర్గానికి చెందిన బచ్చుల అర్జునుడుని పెట్టారు.

అయితే అర్జునుడు సరిగ్గా పనిచేయడం లేదని, వంశీకి పోటీ ఇవ్వలేరని, ఆయన అభ్యర్ధిగా ఉంటే గన్నవరంలో ఓడిపోవడం ఖాయమని కమ్మ వర్గం అంటుంది. కాబట్టి ఆయనని మార్చి ఎవరైనా కమ్మ నేతకు బాధ్యతలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటు మొదట నుంచి నూజివీడులో కమ్మ వర్గం..ఇతర వర్గాల నేతలకు చుక్కలు చూపిస్తూనే ఉంది. గత రెండు ఎన్నికలుగా బీసీ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు సహకరించని పరిస్తితి. ఇలా బీసీ నేతలకు కమ్మ వర్గం చుక్కలు చూపిస్తూనే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

tdp