నెల్లూరు అంటే రెడ్డి వర్గం అడ్డా...ఇక్కడ ఏ పార్టీ అయిన గానీ రెడ్డి నేతలదే పైచేయి. అయితే మొదట నుంచి రెడ్డి వర్గం టీడీపీకి వ్యతిరేకంగానే ఉంటూ వస్తుంది. అందుకే నెల్లూరులో గతంలో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీల హవా నడుస్తోంది. ఇక్కడ వైసీపీ బలం ఏ మాత్రం తగ్గకపోవడానికి కారణం రెడ్డి నేతలే. 2014 ఎన్నికలు కావొచ్చు..2019 ఎన్నికలు కావొచ్చు నెల్లూరులో వైసీపీ హవా నడవడానికి రెడ్డి వర్గమే కారణం. అందుకే ఇప్పుడు జిల్లాలో రెడ్డి ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉన్నారు.

గత ఎన్నికల్లో నెల్లూరులో ఉన్న 10 సీట్లని వైసీపీనే గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ 10 సీట్లలో 7 సీట్లలో రెడ్డి నేతలే గెలిచారు. అంటే నెల్లూరులో రెడ్డి ఎమ్మెల్యేలే ఎక్కువ. వెంకటగిరిలో ఆనం రామ్ నారాయణరెడ్డి, సర్వేపల్లిలో కాకాని గోవర్ధన్ రెడ్డి, ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆత్మకూరులో మేకపాటి గౌతమ్ రెడ్డి, కావలిలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, నెల్లూరు రూరల్‌లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోవూరులో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిలు ఉన్నారు.

ఇక నెల్లూరు సిటీలో బీసీ నేత అనిల్ కుమార్ యాదవ్ ఉండగా, సూళ్ళూరుపేట, గూడూరులో ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గాలు. అవి పేరుకు ఎస్సీ స్థానాలైనా ఆధిక్యం మాత్రం రెడ్డి వర్గందే. ఇలా 10 సీట్లలో 7 గురు రెడ్డి ఎమ్మెల్యేలే ఉన్నారంటే...నెల్లూరులో వైసీపీ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. అయితే వచ్చే ఎన్నికల్లో ఈ రెడ్డి ఎమ్మెల్యేల్లో ఎంతమంది మళ్ళీ విజయతీరాలకు చేరతారంటే...ప్రస్తుతం నెల్లూరులో ఉన్న రాజకీయాలని బట్టి చూసుకుంటే మళ్ళీ అందరూ గెలిచేలా ఉన్నారు. కానీ నిదానంగా టీడీపీ కూడా పుంజుకుంటుంది. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు స్ట్రాంగ్ అవుతున్నారు. అలాగే కొందరు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది. కాబట్టి ఈ సారి రెండు, మూడు చోట్ల రెడ్డి నేతలకు షాక్ తగలొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: