భారత వాయుసేన ను ఎంతో పటిష్టవంతం చేయాలనే లక్ష్యాన్ని యజ్ఞంలా నిర్వహిస్తోంది భారత ప్రభుత్వం. ఈ క్రమంలోనే విదేశాల నుంచి ఎంతో అధునాతనమైన ఆయుధాల కొనుగోలు చేయడమే కాదు స్వదేశీ ఆయుధాలను కూడా శరవేగంగా అభివృద్ధి చేస్తూ భారత అమ్ములపొదిలో చేరుస్తూ వుండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇటీవలే సరిహద్దుల్లో రక్షణ కోసం రష్యా నుంచి ఎస్-400 క్షిపణులను భారత్ కొనుగోలు చేసింది. ఏకంగా 500 కోట్ల డాలర్లను వెచ్చించి s400  రక్షణ క్షిపణి వ్యవస్థలకు రష్యా నుంచి కొనుగోలు చేయగా.. ఇటీవల భారత్ కు డెలివరీ ఇచ్చింది. దీంతో ఈ s400 క్షిపణులను సరిహద్దులో మోహరించింది భారత్.


 s400 క్షిపణుల రాకతో అటు భారత వాయుసేన మరింత పటిష్టవంతంగా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే సాధారణంగా ఏదైనా దేశాలతో అమెరికా మిత్రదేశాలు సంబంధం పెట్టుకోవడం లేదా ఆయుధాలు కొనుగోలు చేయడం లాంటివి చేస్తే అటు అగ్రరాజ్యమైన అమెరికా కఠిన ఆంక్షలు విధించడం లాంటివి చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవలే అమెరికా మిత్ర దేశమైన భారత్ రష్యా నుంచి ఎస్ 400 క్షిపణులను కొనుగోలు చేసిన నేపథ్యంలో రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయవద్దు అంటూ అమెరికా భారత్ పై ఒత్తిడి తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.




 రష్యా నుంచి ఎస్-400 క్షిపణులను కొనుగోలు చేయవద్దు అని భారత్ను వారిస్తున్నాము. అదే సమయంలో చైనాతో భారత్కు ఏర్పడిన ఘర్షణ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకున్నాం. ఈ సమయంలో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి  అంటూ అమెరికా స్టేట్మెంట్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే అమెరికా ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చిన నేపథ్యంలో అటు భారత్ ఎలా స్పందించబోతుంది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇప్పటికే అమెరికా ను కాదని ఇతర దేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసిన దేశాలపై నిషేధ ఆంక్షలు విధిస్తూ వస్తుంది అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే భారత్ ఎలా స్పందించపోతుంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: