ఏపీలో అధికార వైసీపీ లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో చాలా మంది నేత‌ల‌కు, సిట్టింగ్‌ల‌కు ఈ సారి టిక్కెట్లు ఉండ‌వ‌న్న ప్ర‌చారం సొంత పార్టీ వ‌ర్గాల్లోనే జోరుగా వినిపిస్తోంది. ఈ లిస్టులో చాలా మంది ఉన్నారు. ఈ సారి వ్య‌తిరేక‌త ఎదుర్కొంటోన్న కొంద‌రు ఎమ్మెల్యేల‌కు టిక్కెట్లు రావ‌న్న సంకేతాలు ఆ పార్టీ ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు వ‌చ్చేస్తున్నాయ‌ట‌. వీరి సంగ‌తి ఇలా ఉంటే కొంద‌రు ఎంపీ ల‌కు కూడా ఈ సారి టిక్కెట్లు వ‌చ్చే అవ‌కాశాలు లేవంటున్నారు.  కొంద‌రు సీనియ‌ర్లు గా ఉండ‌డం.. ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌క‌పోవ‌డం కార‌ణం అయితే.. కొంద‌రు ఎంపీలు ఈ సారి పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు రెడీ గా ఉన్నారు. మ‌రి కొంద‌రు ఎంపీలు ప్ర‌జా వ్య‌తిరేక‌త‌తో  కొట్టు మిట్టాడుతున్నారు.

అందుకే ఈ సారి వైసీపీ లో చాలా మంది సిట్టింగ్ ఎంపీలు తిరిగి పోటీ చేసే ప‌రిస్థితి లేదు. సీనియ‌ర్లు ఉన్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తో పాటు నెల్లూరు ఎంపీ ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డికి ఈ సారి సీట్లు వ‌చ్చే ప‌రిస్తితి లేదు. ఇక కాకినాడ ఎంపీ వంగా గీత‌, అన‌కాప‌ల్లి ఎంపీ స‌త్య‌వ‌తి, అమ‌లాపురం ఎంపీ అనూరాధ‌, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్ , బాప‌ట్ల ఎంపీ నందిగం సురేష్‌కు ఈ సారి టిక్కెట్లు రావ‌ని అంటున్నారు.

ఇక న‌ర‌సాపురం ఎంపీ క‌నుమూరు ర‌ఘురామ కృష్ణంరాజుకు ఎలాగూ టిక్కెట్ రాదు. అయ‌న్ను పార్టీ ఎప్పుడు సస్పెండ్ చేస్తుంది ?  లేదా అంత‌క‌న్నా ముందే ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తే ఉప ఎన్నిక‌లు వ‌స్తాయా ? అన్న‌ది చూడాలి. ఇక న‌ర‌సారావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవ‌రాయులు వ‌చ్చే ఎన్నిక‌ల్లో తిరిగి మ‌రోసారి ఎంపీ గా పోటీ చేయ‌ర‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏదేమైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో చాలా మంది సిట్టింగ్ ల సీట్ల‌కు కోత త‌ప్పేలా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: