గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏ స్థాయిలో జగన్ ప్రభుత్వంపై పోరాడుతున్నారో చెప్పాల్సిన పని లేదు. జగన్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పవన్ ఫైట్ చేస్తున్నారు. పవన్ ఒకోసారి హైదరాబాద్‌కే పరిమితవుతున్న సరే...రాష్ట్రంలో జనసేన నేతలు కూడా జగన్ ప్రభుత్వంపై పోరాడుతున్నారు. ఎక్కడకక్కడ పలు సమస్యలపై గళం విప్పుతున్నారు. అంటే జనసేన పార్టీ టోటల్‌గా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని చెప్పొచ్చు.

అలాగే జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే వైసీపీపై ఫైట్ చేస్తున్న టీడీపీ-జనసేనలు ఒక్కటయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం కూడా మొదలైంది. ఇప్పటికే పవన్‌ని కలుపుకోవడానికి చంద్రబాబు రెడీగా ఉన్న విషయం తెలిసిందే. అదే సమయంలో పొత్తుపై పవన్ ఇప్పుడు సరిగ్గా స్పందించకపోయిన కూడా...ఆయన కూడా పొత్తుకు రెడీగా ఉన్నట్లు పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు.

ఇక బాబు-పవన్‌లు గాని కలిస్తే జగన్‌కు డ్యామేజ్ జరగడం ఖాయం. మరి ఈ పరిస్తితులు వైసీపీకి అర్ధమయ్యాయనే అనుకోవచ్చు..అందుకే అనుకుంటా ఆయన, చిరంజీవి ద్వారా మరో రూట్‌లో వస్తున్నారు. సినిమా టిక్కెట్ల అంశం గురించి అని చెప్పి చిరంజీవిని మాత్రమే పర్సనల్‌గా పిలిచారు. పైగా జగన్‌తో లంచ్ చేసి మరీ బయటకొచ్చిన చిరంజీవి..మీడియా ముందు జగన్‌పై పొగడ్తల జల్లు కురిపించారు. దీంతో సీన్ పూర్తిగా మారిపోయినట్లు కనిపించింది.

చిరు పొగడ్తల వల్ల..మెగా అభిమానుల్లో చీలిక వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొందరు అభిమానులు జగన్ వైపుకు కూడా చూడొచ్చు. అలాగే కాపులు సైతం మారే ఛాన్స్ ఉంది. అందుకే జగన్, చిరంజీవిని కలిశారనే ప్రచారం ఉంది. ఇక చిరంజీవి వల్ల జనసేనకే డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంది. ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయాలంటే పవన్ రంగంలోకి దిగాల్సిందే అని జనసైనికులు అంటున్నారు. ఇంకా జగన్ ప్రభుత్వంపై యుద్ధం తీవ్రం చేయాలని లేదంటే ఇబ్బందుల్లో పడతామని భావిస్తున్నారు. చూడాలి మరి చిరు ఎఫెక్ట్‌ని పవన్ తగ్గిస్తారో లేదో?


మరింత సమాచారం తెలుసుకోండి: