చిరుకు రాజ‌కీయాలు ప‌డ‌లేదు
అందుకే దూరం
సినిమాలు కూడా కాస్త లెక్క మీదే
చేసుకుంటూ వెళ్తున్నాడు
ఆచార్య లెక్క ఇంకా తేల‌లేదు
సినిమాలే జీవితం త‌ప్ప
మ‌ళ్లీ ఇటుగా వ‌స్తాన‌ని కూడా
ఆయ‌న చెప్ప‌లేదు
అప్పుడే
విమ‌ర్శ‌నాస్త్రాలు మాత్రం
చిరు రాజ‌కీయ జీవితంపై
మొద‌ల‌యిపోయాయి


జ‌గ‌న్ అనుకున్న విధంగా చిరు అనుకున్న విధంగా రాజ‌కీయాలు ఉండ‌వు కానీ ఏదో ఒక రోజు మెగాభిమానులు మాత్రం వైసీపీ చేయించే అబ‌ద్ధాల‌ను అడ్డుకుంటార‌ని అంటోంది జ‌న‌సేన‌.రాజ‌కీయంగా నిన్న‌టి భేటీకి అస్స‌లు ప్రాధాన్యం లేకున్నా ఏపీ సీఎంఓ లీకుల పేరిట కొత్త డ్రామా ఒక‌టి న‌డుపుతున్నార‌ని మండిప‌డుతున్నారు.త‌మ హీరోకు అటువంటి ఉద్దేశాలు లేవ‌ని, లేని ఉద్దేశాలు ఎలా అంట‌గ‌డ‌తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు.  

గ‌త కొద్దికాలంగా టికెట్ రేట్లు త‌గ్గించండంపై ఇచ్చిన జీఓ ఓ పెద్ద వివాద‌మే రేపుతోంది.వీటిపై మాట్లాడేందుకు చిరుతో జ‌గ‌న్ లంచ్ మీట్ ఏర్పాటు చేశారు.ఆయ‌నొక్క‌రికే ఇండ‌స్ట్రీ నుంచి అవ‌కాశం రావ‌డంతో దీన్నొక రాజ‌కీయ అంశంగా మ‌లుచుకునేందుకు కొన్ని వ‌ర్గాలు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టాయ‌ని జ‌న‌సేన ఆరోప‌ణ‌లు చేస్తోంది.

ప‌రిశ్ర‌మ‌కు సంబంధించి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకే చిరు అక్క‌డికి వెళ్లార‌ని రాజ‌కీయాలు మాట్లాడేందుకు వెళ్ల‌లేద‌ని క‌నుక ఈ విష‌యాన్ని రాజ‌కీయం చేయ‌వ‌ద్ద‌ని విన్న‌విస్తున్నారు జ‌న‌సేన అధికార ప్ర‌తినిధులు.ఇన్ని జరిగినా కూడా ఏదో ఒక వార్త సోష‌ల్ మీడియాలో చిరు పై వ‌స్తూనే ఉంది.గ‌తంలో పీఆర్సీ ఉదంతాల‌ను ప్ర‌స్తావిస్తూ కొంద‌రు అదే ప‌నిగా రాస్తుండ‌డాన్ని కూడా మెగాభిమానులు త‌ప్పు ప‌డుతున్నారు.అప్పుడెప్పుడో జ‌రిగిన విష‌యాల‌ను గుర్తు పెట్టుకుని ఇలా అసంద‌ర్భంగా రాయ‌డం త‌గ‌ద‌ని కూడా అంటున్నారు.హిత‌వు చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో రాజ‌కీయ ర‌గ‌డ ఒక‌టి నెల‌కొంది.తీవ్ర‌త‌రం అవుతోంది కూడా! దీనిపై చిరు క్లారిటీ ఇచ్చారు.త‌నకు ఎటువంటి ఆఫ‌ర్ రాలేద‌ని చెప్పారు.అయిన‌ప్ప‌టికీ కొన్నిమీడియాలు అదే ప‌నిగా రాస్తున్నాయ‌ని జ‌న‌సేన ప్ర‌తినిధులు మండిప‌డుతున్నారు.ప్ర‌స్తుతానికి తాను రాజ‌కీయాల‌కు సంబంధిత ప‌ద‌వుల‌కు దూరం అని స్పష్టం చేశారు.ఇదే స‌మయంలో జ‌న‌సేన మాత్రం త‌న‌దైన వాద‌న ఒక‌టి వినిపిస్తుంది.చిరును టార్గెట్ చేస్తూ రాజ‌కీయంచేయాల‌న్న ఉద్దేశంతోనే లీక్స్ ఇచ్చార‌ని అంటోంది.దీంతో వివాదం పండుగ వేళ మ‌రింత ముదిరింది.దీనిపై వైసీపీ అయితే ఇప్ప‌టిదాకా స్పందించ‌లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: