ఎవరినైనా మరొకరు స్పూర్తిగా తీసుకోలంటే వారిలో ఏదో గొప్పదనం ఉండాలి. లేదా పదిమందికి మార్గదర్శకంగా నిలిచుండాలి. కానీ అదేమీలేకుండానే తనను అందరు స్పూర్తిగా తీసుకోవాలని ఎవరైనా పిలుపిస్తే... తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు అదే చేశారు. తనను స్పూర్తిగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజలు పోరాటం చేయాలని  పిలుపిచ్చారు.





ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయటంలో జనాలు తననే స్పూర్తిగా తీసుకోవాలట. అసలు జగన్ ప్రభుత్వంపై తాను చేస్తున్న పోరాటమేంటో రఘురాజే చెప్పాలి. గెలిచిన తర్వాత జగన్ తో చెడింది. దాంతో ఎక్కడో ఢిల్లీలో కూర్చుని ప్ర్రభుత్వంపైన, జగన్ పైన నోటికొచ్చినట్లు మాట్లాడటం తప్ప ఎంపీ చేసిన పోరాటమేంటో ఎవరికీ తెలీదు. ప్రతిరోజు రచ్చబండ కార్యక్రమం పేరుతో జగన్ వ్యతిరేక మీడియాతో మాట్లాడటం ఎంపీ చేస్తున్నదేమీ లేదు. జగన్ తో చెడిన తర్వాత అసలు నియోజకవర్గం మొహమే చూడలేదు.





ఇంతోటి దానికే జగన్ ప్రభుత్వంపై తాను పెద్ద పోరాటం చేసేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చుకోవటమే విచిత్రంగా ఉంది. ఎంపీ తరహాలోనే జనాలందరు పోరాటాలు చేయలంటే వాళ్ళు కూడా నియోజకవర్గాన్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారా ? జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం అంటే కేసులు, అరెస్టుకు భయపడకుండా నియోజకవర్గంలోనే ఉండాలి. ఎన్ని సమస్యలు వచ్చినా పారిపోకుండా నరసాపురంలో క్యాంపుచేయటాన్నే పోరాటమంటారు.





అంతేకానీ ఇపుడు ఎంపీ చేస్తున్నదాన్ని ఎవరు పోరాటమనరు.  హైదరాబాద్ కు వచ్చిన ఎంపీని కలిసి సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మనగానే వెంటనే ఢిల్లీకి పారిపోయారు. నిజంగానే ధైర్యముంటే ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం భీమవరంలోనే రెండు రోజులు పర్యటించుండాలి. నోటీసులిస్తేనే భయపడి ఢిల్లీకి వెళ్ళిపోయి లాయర్లతో మాట్లాడుతున్న ఎంపీ కూడా తానో గొప్ప ధైర్యవంతుడినని బిల్డప్ ఇచ్చుకుంటున్నారు. పైగా తనను జనాలందరు స్పూర్తిగా తీసుకోవాలని పిలుపొకటి మళ్ళీ. రేపు వచ్చే ఉపఎన్నికల్లో మళ్ళీ తననే గెలిపించమని అడుగుతున్నారు. మొన్నటి ఎన్నికల్లోనే వైసీపీ తరపున పోటీచేశారు కాబట్టే గెలిచారు. లేకపోతే అప్పుడే తేలిపోయేది రఘురాజు సీన్ ఏమిటో ?


మరింత సమాచారం తెలుసుకోండి: