ఆంధ్రప్రదేశ్‌  సీఎం జగన్‌కు కాగ్ రిపోర్ట్ ఓ బ్యాడ్‌ న్యూస్.. మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది..   ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి నవంబరు నెలాఖరు వరకూ ఉన్న ఆర్థిక పరిస్థితులపై కాగ్‌ తాజాగా లెక్కలు విడుదల చేసింది. ముందుగా జగన్‌కు గుడ్‌ న్యూస్‌ ఏంటో తెలుసుకుందాం.. ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీకి కాస్త ఊరటనిచ్చే వార్త ఇది.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయం క్రమంగా పెరుగుతోందట. ఈ ఆర్థిక ఏడాదిలో నవంబర్ వరకూ రూ.88,618.58 కోట్ల ఆదాయం వచ్చిందట.


గత ఐదేళ్లలో వచ్చిన ఆదాయాలతో పోలిస్తే ఇదే అత్యధిక ఆదాయంగా కాగ్‌ రిపోర్ట్ చెబుతోంది. షాకింగ్ ఏంటంటే.. కరోనా ముందు నాటి ఆదాయాలను అధిగమించి మరీ రాష్ట్ర ఆదాయాలు వస్తున్నాయట. అంంటే..  2019 నవంబరు ఆదాయం కన్నా ఇప్పటి ఆదాయం అధికంగానే ఉంది. అంతే కాదు.. అంతకుముందు.. 2017 నవంబరు తో పోల్చినా తాజా ఆదాయమే ఎక్కువేనని కాగ్ రిపోర్టును చూస్తే అర్థమవుతోంది. అయితే ఏటా రాష్ట్ర ఆదాయంలో 15 శాతం పెరుగుదల అన్నది సహజమేనని చెబుతారు. కానీ.. కరోనా కాలంలోనూ ఆదాయం పెరగడం సానుకూల అంశమే.


మరి గుడ్ న్యూస్‌ ఓకే.. మరి బ్యాడ్‌ న్యూస్ ఏంటి అంటారా.. అక్కడికే వస్తున్నా.. ఆదాయాల్లో మెరుగుదల కనిపించినట్టే.. అప్పుల్లోనూ ఏపీలో పెరుగుదల కనిపిస్తోంది. ఏటి కేడాది రాష్ట్రంపై అప్పుల భారం పెరిగిపోతోంది.  2017లో బహిరంగ మార్కెట్‌ రుణాలు నవంబరు నాటికి రూ.35,292.17 కోట్లుగా ఉన్నాయి. ఈ ఆర్థిక ఏడాదిలో నవంబరు నాటికి బహిరంగ మార్కెట్‌లో రూ.49,570.31 కోట్ల రుణం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే దాదాపు 15 వేల కోట్లు ఎక్కువ అన్నమాట. ఇక ఈ బహిరంగ మార్కట్‌ రుణాలు.. 2019 నవంబరుతో పోలిస్తే 41.64% మేర పెరిగాయని లెక్కలు చెబుతున్నాయి. ఫైనల్‌గా తేలేదేమిటంటే.. రాష్ట్రానికి ఆదాయం పెరుగుతూనే ఉంది.. అలాగే అప్పులూ పెరుగుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: