సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేసి గొప్ప రాజకీయ నాయకుడిగా ఎదగాలని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే రాజకీయ నాయకుడిగా ఎదగడం కోసం ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక ఇలా పోటీ చేసిన తర్వాత ఓటమి  పాలు అయితే ఎంతో నిరాశ చెందుతుంటారు. ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం గెలవడానికి కాదు ఓడిపోవడానికి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు ఇలా ఓడిపోవడం లో కూడా కిక్కు ఉంటుంది అని చెబుతున్నాడు. ఇలా ఎన్నికల్లో ఓడిపోవడం లో సెంచరీ కొట్టి సరికొత్త రికార్డు సృష్టించడమే తన కోరిక అంటూ చెబుతున్నాడు. ఈ అయితే పంచాయతీ ఎన్నికల  దగ్గర నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు అన్ని ఎన్నికల్లో పోటీ చేయడమే టార్గెట్గా పెట్టుకుని బరిలోకి  దిగుతున్నాడు సదరు వ్యక్తి.



 ఇక ఇప్పటి వరకు ఏకంగా తొంభై మూడు సార్లు ఎన్నికల్లో పోటీ చేశాడు. 93 సార్లు కూడా ఓడిపోయాడు. ఎట్టిపరిస్థితుల్లో 100 ఎన్నికలలో ఓడిపోయి రికార్డ్ సృష్టిస్తాను  అంటూ చెబుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఆయన పేరే  హసనూ రామ్. ఇప్పుడు వరకు ఓడిపోవడానికి 93 ఎన్నికల్లో పోటీ హసనూ రామ్ ఇక ఇప్పుడు మరో ఎన్నికల్లో బరిలోకి దిగబోతోన్నాడు. 74 ఏళ్ల హసనూ రామ్ ఇలా చేయడానికి ఒక కారణం ఉందట. 36 ఏళ్ల క్రితం ఒక పెద్ద పార్టీ హసనూ రామ్ కు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పి చివరి నిమిషంలో టికెట్ ఇవ్వలేదట. టికెట్ ఇస్తామని చెప్పడంతో తన ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు హసనూ రామ్. దీంతో అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు



 అయితే ఒకానొక సమయంలో ఫతేపూర్ సిక్రీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థిగా మూడో స్థానంలో నిలిచాడు హసనూ రామ్. ఇలా ఇప్పటి వరకూ వచ్చిన పంచాయితీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు అన్ని ఎన్నికల్లో కూడా పోటీ చేస్తూ వస్తున్నాడు. ఇక 2022లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హసనూ రామ్ ఆగ్రాలోని రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఓటమి ఖాయం అని నాకు ముందే తెలుసు.. ఓడిపోకుండా ఆపగలిగే శక్తి ఎవరికీ కూడా లేదు. అయితే గెలవడం కాదు ఓడిపోవడమే నా జీవిత లక్ష్యం అంటూ చెబుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు హసనూ రామ్.

మరింత సమాచారం తెలుసుకోండి: