సంక్రాంతి సంద‌ళ్లు ఎలా ఉన్నా కూడా ఈ సారి మాత్రం కాస్త భిన్నం అయిన వాతావ‌ర‌ణానికి ద‌గ్గ‌ర‌గా ఉంది.పండ‌గ రోజుల్లోనే జ‌గ‌న్ తో చిరు భేటీ అయ్యాక కొత్త కొత్త వాద‌నలు పుట్టుకు వ‌స్తున్నాయి.కొత్త కొత్త విశ్లేష‌ణ‌లు పుట్టుకువ‌స్తున్నాయి.వీటికి  చెక్ పెట్టేందుకు మెగా కాంపౌండ్ ప్ర‌య‌త్నిస్తూనే ఉంది. ఏ మేర‌కు ఫ‌లితాలు వ‌స్తాయో మ‌రి!


సంక్రాంతి పండుగ వేళ కొన్ని వివాదాల సెగ కూడా త‌గ్గ‌డం లేదు.ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి ఓ వివాదం నెల‌కొని ఉంది.ఇటీవ‌ల ఆయ‌న ఏపీ సీఎం జ‌గ‌న్ తో భేటీ అయిన సంద‌ర్భంగా కొన్ని కీల‌క విష‌యాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయి.వీటిపైనే ఆయ‌న మాట్లాడి, కొంత సామార‌స్య పూర్వ‌క ధోర‌ణి అన్న‌ది ప్ర‌భుత్వం నుంచి పొంది బ‌య‌ట‌కు వ‌చ్చారు.ఇదంతా బాగానే ఉన్నా కొంద‌రు మాత్రం ఆయ‌నకు సీఎం జ‌గ‌న్ రానున్న కాలంలో రాజ్య స‌భ సీటు కేటాయించ‌నున్నార‌ని కూడా పుకార్లు పుట్టించారు.దీంతో అలెర్ట్ అయిన చిరంజీవి సంబంధిత వార్త‌ల‌పై ఖండ‌న ఇచ్చారు.అదేవిధంగా గివ్ న్యూస్ నాట్ వ్యూస్ పేరిట ఒక  హ్యాష్ ట్యాగ్ ను కూడా సామాజిక మాధ్య‌మాల్లో ఆయ‌న ఉంచారు.దీనిపై విప‌రీతం అయిన స్పంద‌న వ‌స్తుంది.

మెగాభిమానులు కూడా త‌మ అభిమాన హీరో పై వ‌స్తున్న పుకార్ల‌ను కొట్టిపారేస్తున్నారు.కేవ‌లం చిత్ర ప‌రిశ్ర‌మ‌కు సంబంధించి మాత్ర‌మే చిరు మాట్లాడారని ప‌దే ప‌దే చెబుతున్నారు.ఈ త‌రుణంలో మెగాస్టార్ విపరీతంగా ట్రోల్ అవుతున్నారు.ఆయ‌న చెప్పిన మాట‌ల‌కు, ఇప్పుడు వ‌స్తున్న వార్త‌లకు పొంత‌న లేక‌పోవ‌డంతో వివాదం పెరిగిపోతోంది.ఈ ద‌శ‌లో ఇండ‌స్ట్రీ నుంచి చాలా మంది మీడియా ముందుకు వ‌చ్చి మాట్లాడితే మ‌రికొంత క్లారిఫికేష‌న్ వస్తుంది.క‌నీసం సామాజిక మాధ్య‌మాల్లో అయినా స్పందిస్తే ఇంకా బాగుంటుంద‌ని ఇంకొంద‌రు అభిప్రాయం వెల్ల‌డి చేస్తున్నారు.ఏదేమ‌యిన‌ప్ప‌టికీ ఇప్ప‌ట్లో ఈ వివాదంను ముగించాల్సింది మీడియానే! మీడియాతో పాటు డిజిట‌ల్ మాధ్య‌మాలు కూడా! రాజకీయం తాను ఏ ప‌ద‌వీ పొంద‌బోన‌ని, త‌న‌కు అలాంటి కోరిక‌లు లేవ‌ని ప‌దే ప‌దే అంటూ వ‌స్తున్నారు చిరు. అయిన‌ప్ప‌టికీ వైసీపీ ఓ వ్యూహాత్మ‌క వైఖ‌రిలో భాగంగానే త‌మ హీరోను ఇరికించింద‌ని మెగాభిమానులు అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: