కొత్త హీరోలు కొత్త క‌థల వేట‌లో ఉండ‌వ‌చ్చు.దాన్నెవ్వ‌రూ కాద‌నరు కానీ ఆ క‌థ‌ను డీల్ చేసే కుర్రాడే మిస్ ఫైర్ అయితే తుపాకీ ఉన్నా తూటాలు ఉన్నా యుద్ధంలో మాత్రం గురి త‌ప్పిన కార‌ణంగా ఓట‌మి మాత్రం ఖాయం.అందుకే గ‌ల్లా అశోక్ కు ఓ మంచి డైరెక్ట‌ర్ దొర‌కాల‌ని కోరుకుందాం.సంక్రాంతి సంద‌ళ్ల‌లో అందాల నిధిని చూసి కాసేపు రిలాక్స్ అవుతాం అనుకుంటే మాత్రం వెళ్లండి..అయితే వెళ్లి వ‌చ్చాక రామూ నో పూరీనో తిట్టుకోకుండ్రి..ఎందుకంటే వాళ్లు మాత్ర‌మే మాఫియా క‌థ‌లు అంత బాగా డీల్ చేయ‌గ‌ల‌రు. కొత్త పిల్ల‌లకు చేత‌గాదు.నేర్చుకోవాల్సిందే!


మ‌హేశ్ బాబు అల్లుడు ఎంట్రీ ఇచ్చాడు. దీంతో పండ‌గ వేళ పెద్ద హీరో సినిమాతో ఢీ కొని అశోక్ పెద్ద సాహ‌స‌మే చేశాడు. త‌మ సొంత బ్యాన‌ర్ అమ‌ర్ రాజా ఎంట‌ర్టైన్మెంట్స్  లో రూపుదిద్దుకున్న ఈ సినిమాపై మొద‌టి నుంచి మంచి సంకేతాలు ఇచ్చాడు.అదేవిధంగా మూవీ ప్ర‌మోష‌న్ కు మ‌హేశ్ బాబు త‌న‌వంతు స‌హ‌కారం అందించాడు.ప్రీరిలీజ్ వేడుక‌లు కూడా బాగానే చేశారు.ఎక్క‌డా ఏం లోటూ లేకుండా ఈ సినిమాను తీసుకువ‌చ్చిన విధంగా ఏ చిన్న సినిమా విష‌యంలోనూ జ‌ర‌గ‌లేదు. ప్ర‌మోష‌న్స్ లో హీరో రానా కూడా భుజం కాశాడు. ఇలా ఒక్క‌రేంటి ఇండ‌స్ట్రీలో సూప‌ర్ స్టార్ కృష్ణ అభిమానులు అంతా ఎంపీ జ‌య‌దేవ్ కొడుకును ఆశీర్వ‌దించారు.మొద‌టి సినిమాయే కానీ బాగా చేశాడు అని ఆయ‌న ఐదారేళ్ల క‌ష్టం స్క్రీన్ పై చూడ‌నున్నారు అని కూడా మహేశ్ బాబు ఇప్ప‌టికే కాంప్లిమెంట్లు ఇచ్చాడు.ఇవ‌న్నీ సినిమాపై ఉన్న అంచనాలు బాగానే పెంచాయి.నిధి అగ‌ర్వాల్ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంటుంద‌ని మొద‌ట్నుంచి ఈ పెయిర్ ను ఆడియెన్స్ ఇష్ట‌ప‌డ‌తార‌ని చిత్ర నిర్మాణ వ‌ర్గాలు చెబుతూనే ఉన్నాయి.ఇవ‌న్నీ ఈ సినిమా స్థాయిని పెంచాయి. ఇక నిన్న‌టి వేళ విడుద‌ల‌యిన సంక్రాంతి సినిమాల్లో కృష్ణ మ‌న‌వ‌డు హీరో లా ఎలా ఉన్నాడంటే?

ముంబ‌య్ మాఫియా నేప‌థ్యంలో వ‌చ్చే క‌థ‌తో ఈ సినిమాను రూపొందించారు డైరెక్ట‌ర్ ఆదిత్య శ్రీ‌రామ్..గ‌తంలో ఇలాంటి సినిమాలు రాలేదు అని కాదు కానీ కొత్త హీరోతో ఇలాంటి బ్యాక్ డ్రాప్ ను ఊహించ‌లేం. మాఫియా చుట్టూ తిరిగే ఈ క‌థ‌లో హీరో ఏ విధంగా చిక్కుకున్నాడు ఏ విధంగా బ‌య‌ట‌ప‌డ్డాడు..ఇవే కాకుండా హీరోయిన్ కు క‌థ‌కు ఉన్న లింక్ ఏంటి? ఇలాంటి కొన్ని ఇంట‌స్ట్రింగ్ పాయింట్లు తెర‌పై చూస్తేనే బాగుంటుంది.కానీ కొన్ని సీన్లు వ‌ర‌కూ డైరెక్ట‌ర్ ఎక్స్ పీరియెన్స్ మాత్రం చాల్లేదు అని కొంద‌రు అంటున్నారు.పాట‌లు పర్లేదు అని కూడా ఓ అభిప్రాయం ఉన్నా కెమెరా ప‌నిత‌నం మాత్రం చాలా అంటే చాలా బాగుంద‌ని కితాబులు వ‌స్తున్నాయి.ఓ విధంగా మాఫియా క‌థ‌లు అంటే ఆర్జీవీ గుర్తుకు వ‌స్తారు.తుపాకీ చుట్టూ క‌థ‌లు తిప్పాల‌న్నా చెప్పాల‌న్నా తిప్పి చెప్పాల‌న్నా ఆర్జీవీ త‌రువాత పూరీనే గుర్తుకు వ‌స్తారు.ఆ వ‌రుస‌లో ఈ సినిమా ను కూడా క‌ల‌ప‌వచ్చు అని అనుకోలేం కానీ ఆడియెన్స్ కు పండ‌గ వేళ ఓ టైంపాస్ కావాలంటే గో అండ్ వాచ్ ఇట్.



మరింత సమాచారం తెలుసుకోండి: