పెద్ద పండుగ‌కు అంతా రావాలి ఇదీ ప‌ల్లెల‌లో నెల రోజుల క‌న్నాముందు వినిపించే మాట. పండ‌గ అంటే గోదావ‌రిది. ఆ తీరాల్లో ఆడిపాడే పిల్ల‌కాయ‌ల‌ది. పెద్ద‌మ్మ పంచిన సంతోషం లాంటిది.. పెద్ద‌నాన్న ఇచ్చిన మిఠాయిలాంటిది. ఇంకా ఎన్నో! పండుగ అంటే ఇంటికి వ‌చ్చే ధాన్య‌మే కాదు ఇంటికి వ‌చ్చే భ‌రోసా కూడా! అది దేవుడే ఇచ్చిన భ‌రోసా.. నేల త‌ల్లి  రాసిన వీలునామా లో మ‌నం ఎంత వాటా ద‌క్కించుకున్నామో తెలిపే భ‌రోసా! అందుకే పండ‌గ అంటే సుక్కూకు ఇష్టం. మ‌రియు మా లాంటి సామాన్యుల‌కూ ఇష్టం.. కొత్త బ‌ట్ట‌ల సంతోషాల్లో పండ‌గ మిగిల్చిన ఆనందాలే పిల్లప్పుడు పెద్ద‌ప్పుడు ఆనందం. ఇవాళ గోదావ‌రి తీరాలు ఎలా ఉన్నాయో తెలియ‌దు. కానీ ఎలా ఉంటే బాగుండో మాత్రం త‌ప్ప‌క చెప్ప‌గ‌ల‌ను.. సుక్కూ స‌ర్ మీకులానే మాక్కూడా మంచి జ్ఞాప‌కాలే అందించండి. మీ సినిమాల ద్వారా!



గోదావ‌రి తీరాల్లో జీవితం.. సినిమా వాళ్లెవ్వ‌రూ చూపించనంత గొప్ప‌గా ఉంటుంది. ఏ కెమెరాలూ బంధించి తీసుకురాలేనంత గొప్ప‌గా ఉంటుంది. ప‌ట్టు ప‌రికిణీల సంద‌ళ్ల‌లో ప‌ల్లెలు ఈడొచ్చిన ఆడ బిడ్డ‌ల‌ను చూసి పొంగిపోతుంది. సుకుమార్ అనే ఓ డైరెక్ట‌ర్ కు ఈ పండగ సంద‌ళ్లూ స‌ర‌దాలూ ఎప్పుడూ నోస్టాల్జిక్ ఎక్స్ ప్రెష‌నే. పండుగ అంటే పెద్ద పెద్ద హంగామాలే కాదు చిన్ని చిన్న సంతోషాలు కూడా! వాటిని గుర్తు చేసుకుంటూ పండ‌గ చేసుకోవ‌డంలో అమ్మా నాన్న‌ల ఔన్న‌త్యం చాట‌డంలో గొప్ప‌ద‌నం ఉంది.
ఆ ప‌ని ఎవ్వ‌రు చేసినా సంతోష‌మే!

సంక్రాంతి వేళల్లో ఊరి జ్ఞాప‌కాలు గుర్తుకు వ‌స్తాయి.గోదావ‌రి తీరాలు సంక్రాంతి వేళ‌ల్లో మ‌రింత బాగా గుర్తుకువ‌స్తాయి. ఆ ప‌ల్లెల్లో పెరిగి ఆ ప‌ల్లెల్లోనే న‌డ‌యాడిన డైరెక్ట‌ర్ సుకుమార్ త‌న చిన్న‌నాటి జ్ఞాప‌కాల‌ను త‌ల్చుకుంటున్నాడు.పండుగ అంటే ఏం గుర్తుకువ‌స్తాయో.. ఏం చేసేవార‌మో అన్నీ అన్నీ చెబుతున్నాడు సుక్కూ. పండ‌గ అంటే అమ్మ‌కు తిరునాళ్ల నుంచి తీసుకువెళ్లిన ప‌కోడి,ఖ‌ర్జూర‌పు ప‌ళ్లు వెంట‌నే గుర్తుకు వ‌స్తాయ‌ని అన్నాడు. ఆ రోజుల్లో తీర్థాల్లో తాను చేసిన సంద‌డి గురించి, పండ‌గ వేళ తోటి చిన్నారుల‌తో ఆడుకున్న వైనం గురించి మ‌రీ మ‌రీ గుర్తుచేసుకున్నాడు. గోదావ‌రి తీరాల్లో సుక్కూకే కాదు ఎంద‌రికో పండ‌గ అంటే ఓ గొప్ప జ్ఞాప‌కం.

మరింత సమాచారం తెలుసుకోండి: