చిన్న జీయర్ స్వామిని కలిసిన కిషన్ రెడ్డి, మై హోమ్ రామేశ్వరరావు
హైదరాబాద్ శివారు లోని ముచ్చింతల్ లోని చిన్న జీయర్ స్వామిని కలిశారు  కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి.  ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకున్న కిషన్ రెడ్డి..  ఫిబ్రవరి లో జరగబోయే రామానుజ శతాబ్ది ఉత్సవాలు కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి వెంట మై హోం అధినేత రామేశ్వరరావు కూడా ఉండటం గమనార్హం.  ఈ భేటీ అనంతరం  చిన్న జీయర్ స్వామి మాట్లాడారు.  ఫిబ్రవరి 5 న ప్రధాని  ఆశ్రమంలో జరిగే  రామానుజ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారని..  వేదిక  లో మూడు  తలాలు ఉన్నాయి.. మధ్య తలం లో బంగారు విగ్రహాన్ని ఫిబ్రవరి 13 న రాష్ట్రపతి రాం నాధ్ కొవింద్ ప్రతిష్ఠ చేస్తారని వెల్లడించారు చిన్న జీయర్ స్వామి. 

 ఫిబ్రవరి 14 న ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం చేస్తారన్నారు చిన్న జీయర్ స్వామి. ప్రభుత్వం తరుపున అన్ని పనులు చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్  నాతో మాట్లాడారని వెల్లడించారు చిన్న జీయర్ స్వామి.  సీఎం అధికారులు కి అన్ని ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు చిన్న జీయర్ స్వామి.  ఫిబ్రవరి 14 న 108 ఆలయాలు  కి సంబంధించిన దేవతామూర్తులు కళ్యాణం ఒకే వేదిక పై జరుగుతుందని ప్రకటన చేశారు చిన్న జీయర్ స్వామి.  144 యాగ శాలలు లో గుండాలు నిర్మాణం చేసి కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పు కొచ్చారు చిన్న జీయర్ స్వామి.  2 వ తేదీన వాస్తు శాంతి కార్యక్రమం జరుగుతుందన్నారు చిన్న జీయర్ స్వామి.  3 వ తేదీన ఉదయం అగ్ని మధనం కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు చిన్న జీయర్ స్వామి.  ఫిబ్రవరి 7 నుంచి మొదలు  108 ఆలయాలు లో ముహూర్తం బట్టి మూర్తులు  ప్రాణ ప్రతిష్ట జరుగుతుందని స్పష్టం చేశారు చిన్న జీయర్ స్వామి.





మరింత సమాచారం తెలుసుకోండి: