రాష్ట్ర రాజకీయా సమీకరణాలు వేగంగా మారుతున్నాయి...ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీలు సరికొత్త వ్యూహాలతో ముందుకొస్తున్నాయి...ఒకరికొకరు చెక్ పెట్టుకోవడానికి గట్టిగానే ట్రై చేస్తున్నాయి. ఎలాగైనా అధికార వైసీపీ బలం తగ్గించాలని ప్రతిపక్ష టీడీపీ ప్రయత్నిస్తుంది...టీడీపీ బలం పెరగకుండా, ఆ పార్టీకి చెక్ పెట్టేయాలని వైసీపీ చూస్తోంది. రెండు పార్టీల మధ్య చిన్నపాటి యుద్ధ వాతావరణం నడుస్తోంది.

అయితే ఈ పరిణామాల నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో రాజకీయాలు మారుతున్నాయి...అధికార వైసీపీకి కాస్త వ్యతిరేక పరిస్తితులు ఏర్పడుతున్నాయి. ఇదే క్రమంలో గత ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసిన విజయనగరంలో వైసీపీ బలం కాస్త తగ్గుతూ వస్తున్నట్లు కనిపిస్తోంది. జిల్లాలో వైసీపీ బలం పూర్తిగా తగ్గలేదు గానీ...కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం బలం తగ్గిందని చెప్పొచ్చు. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర ప్రజా వ్యతిరేకత కనబడుతుంది..అలా వ్యతిరేకత ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో మళ్ళీ వైసీపీ గెలవడం అనేది కాస్త కష్టమైపోతుందనే చెప్పొచ్చు.

అలా విజయనగరంలో వైసీపీ బలం తగ్గిన నియోజకవర్గాల్లో బొబ్బిలి, విజయనగరం అసెంబ్లీ స్థానాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఈ రెండు చోట్ల వైసీపీ వీక్ అయినట్లు కనిపిస్తోంది...అదే సమయంలో రెండు చోట్ల టీడీపీ కూడా పికప్ అవుతుంది. అసలు బొబ్బిలిలో వైసీపీ పరిస్తితి తారుమారైనట్లే కనిపిస్తోంది...ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే చిన అప్పలనాయుడు పరిస్తితి ఏ మాత్రం బాగోలేదనే చెప్పొచ్చు. అలాగే ఇక్కడ మాజీ మంత్రి సోదరుడు, టీడీపీ నేత బేబీ నాయన దూకుడుగా పనిచేయడంతో, టీడీపీ ఫుల్‌గా పికప్ అయింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బొబ్బిలిలో టీడీపీ గెలిచే పరిస్తితి ఉందని చెప్పొచ్చు. వచ్చే ఎన్నికల వరకు ఇదే పరిస్తితి కంటిన్యూ అయితే...ఇంకా బొబ్బిలిలో టీడీపీ విజయం ఆపడం కష్టమే.

ఇక అశోక్ గజపతి రాజు అడ్డాగా ఉన్న విజయనగరంలో వైసీపీ ఎమ్మెల్యే వీరభద్రస్వామి పరిస్తితి కూడా దిగజారుతుంది. ఎమ్మెల్యేగా ఆయనపై వ్యతిరేకత కనిపిస్తోంది..ఇక్కడ అశోక్ కుమార్తె అతిథి త్వరగా పుంజుకున్నారు. పరిస్తితులు చూస్తుంటే ఈ సీటు కూడా వైసీపీ నుంచి చేజారేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: