భారత్లో టెక్నోలజీ రోజురోజుకి పెరిగిపోతుంది. ముఖ్యంగా ఆయుధ రంగంలో భారత్ కొత్త పుంతలు  తొక్కుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఆయుధాల తయారీలో భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ప్రపంచ దేశాలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ముఖ్యంగా ఆయుధ రంగంలో వినూత్న మైన ఆవిష్కరణలకు ఎప్పుడూ భారత్ ముందు ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒక వైపు విదేశీ ఆయుధ తయారీ కంపెనీలను భారత్లోకి రప్పించడంలో విజయం సాధిస్తోంది.



 ఇలా భారత్ లోకి వచ్చి కంపెనీలు నెలకొల్పిన విదేశీ ఆయుధ తయారీ కంపెనీల తో కలిసి వినూత్నమైన ఆయుధాల తయారీకి శ్రీకారం చుడుతుంది భారత్. అదే సమయంలో భారత రక్షణరంగా పరిశోధన సంస్థ డి ఆర్ డి ఓ కూడా అధునాతనమైన ఆయుధాలను తయారు చేయడంలో ఎప్పటికప్పుడు ముందు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. భారత ప్రభుత్వం నుంచి శాస్త్రవేత్తలకు పూర్తిస్థాయి మద్దతు అందుతున్న నేపథ్యంలో రోజు రోజుకి భారత రక్షణ రంగంలో వినూత్నమైన ఆవిష్కరణలు ఎన్నో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు భారత్ మరో కొత్త ఆయుధాన్ని అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది.



గత ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ రద్దు చేసి ఇక ఇందులోని యూనిట్లను 7 విడి విడి డిఫెన్స్ కంపెనీలుగా భారత ప్రభుత్వం మార్చింది. ఇందులో ఒకటి అయినటువంటి ఏవియేషన్ ఇండియా లిమిటెడ్ 90 రోజుల్లోనే ఒక వినూత్నమైన ఆవిష్కరణ కు శ్రీకారం చుట్టింది అని తెలుస్తోంది. 0.5   మెట్రిక్ టన్నుల బరువు ఉండేటువంటి బాంబును తయారు చేసింది. సుకోయ్, జాగ్వర్ లాంటి ఫైటర్ జట్ల నుంచి ఇక ఈ వినూత్నమైన బాంబును ప్రయోగించేందుకు అవకాశం ఉంటుంది. ఒక బాంబు తో ఒక పెద్ద బ్రిడ్జ్, ఎయిర్పోర్ట్, బంకర్లు లాంటివి కూడా ఎంత సులభంగా ధ్వంసం చేసే సామర్థ్యం కలిగినటువంటి కొత్త టెక్నాలజీతో కూడిన బాంబు అభివృద్ధి చేశారు. ఇలా ఆయుధ రంగంలో భారత్ వినూత్నమైన ఆవిష్కరణలతో దూసుకుపోతూ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: