పాకిస్తాన్ రోజురోజుకూ పరిస్థితులు అధ్వానంగా మారిపోతున్నాయి తప్ప ఎక్కడా కుదుట పడటం లేదు. రోజురోజుకు పాకిస్తాన్ ఆర్థికసంక్షోభంలో కూరుకు పోతున్న నేపథ్యంలో అటు ప్రజలందరూ కూడా తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఒకవైపు పాలకులు మరోవైపు సైన్యం కూడా ఎవరికి వారు స్వప్రయోజనాల గురించి ఆలోచిస్తున్నారు తప్ప ప్రజా ప్రయోజనాల గురించి మాత్రం మరిచిపోతున్నారు అన్న విషయం రోజురోజుకు వెలుగులోకి వస్తూనే ఉంది. ఇప్పటికే ప్రజా ప్రయోజనాలను గాలికి వదిలేసి పాకిస్తాన్ ప్రభుత్వం చైనా చెప్పు చేతుల్లోనే ఉంటుంది. అటు సైన్యం కూడా ప్రభుత్వం చెప్పినట్లు కాకుండా ఇష్టం వచ్చినట్లుగా నడుచుకుంటుంది అన్న విషయం తెలిసిందే.



 సాధారణంగా ఏ దేశంలో అయినా సరే ప్రభుత్వం చెప్పిన విధంగానే సైన్యం వ్యవహరిస్తూ ఉంటుంది. శత్రు దేశాలపై యుద్ధం చేయడానికి లేదా యుద్ధాన్ని విరమించడానికి అయినా సరే ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంటుంది. ఇలా ఆదేశాలు లేకుండా దేశపు సైన్యం మాత్రం ఎప్పుడూ ముందడుగు వేయదు. అదే సమయంలో ఇక దేశానికి సంబంధించిన భూభాగం ఇతర దేశాలు ఆక్రమించుకుంటున్నాయ్ అనుకుంటున్న సమయంలో ప్రాణాలకు తెగించి పోరాడటానికి సిద్ధపడుతూ ఉంటారు సైన్యం. దాదాపు ప్రపంచ దేశాల్లో ఇలాంటి సైన్యం చూశాము. కానీ పాకిస్తాన్ లో మాత్రంసైన్యం దారుణంగా వ్యవహరిస్తుందని  ఇటీవల బయటపడింది.



 పాకిస్తాన్ కు సంబంధించిన భూభాగాన్ని శత్రు దేశాలు వచ్చి ఆక్రమించుకోవడం కాదు ఏకంగా పాకిస్తాన్లో ఉన్న సైన్యమే ఆక్రమించింది. ఇక సైన్యంలో ఉన్నతాధికారిగా కొనసాగుతున్న వారు పాకిస్తాన్ లోని అన్ని భాగాలను ఆక్రమించుకొని ఆయా భూభాగాల్లో భవనాలను నిర్మించుకుని ఇక వాటిని అద్దెకు ఇచ్చి భారీగా డబ్బులు సంపాదించుకుంటున్నారు అన్న విషయం బయటపడింది. లాహోర్,  కరాచీ లాంటి ప్రాంతాలలో ఆక్రమించుకుని షాపింగ్ మాల్స్ ధియేటర్స్ లాంటివి కట్టి ఎంతగానో లబ్ధి పొందుతున్నారట అక్కడి సైన్యాధికారులు. పాకిస్థాన్లోని ప్రధాన నగరాలలో ఉన్నటువంటి పన్నెండు శాతం భూభాగాన్ని ఆర్మీ లోని అధికారులు ఆక్రమించుకున్నారని..  వీటి ద్వారా లబ్ది పొందుతున్నారు అన్న విషయం ఇటీవల బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: