వైసీపీ ఆశావ‌హుల సంఖ్యకు, ఉన్న ప‌ద‌వులకు అస్స‌లు సంబంధం లేదు. కొన్నిసార్లు స్పీక‌ర్ సీతారాం  కూడా తాను పార్ల‌మెంట్ కు వెళ్లాల‌ని అనుకుంటున్నాన‌ని అంటారు.అందుకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో కానీ లేదా ఇప్ప‌టి రాజ్య‌స‌భ టికెట్ల పంపిణీ కానీ త‌న‌కు అనుకూలం కావొచ్చ‌ని సంకేతాలు ఇస్తారు.పోనీ ఆయ‌నకు స్పీక‌ర్ ప‌ద‌వి క‌న్నా మించిన ప‌ద‌వి ఎంపీ ప‌దవి ఎలా అవుతుందో చెబుతున్నారా అంటే అదీ లేదు.ఈ స్పీక‌ర్ ప‌ద‌వి కూడా త‌ప్పించి, హాయిగా ఎమ్మెల్యేగానే కొంత‌కాలం మీరు ప‌రిమితం అయితే బెట‌ర్ అన్న మాట‌లు కూడా జిల్లా వ‌ర్గాల నుంచి వ‌స్తున్నాయి. ఎందుకంటే ఆయ‌న స్పీక‌ర్ గా ప్ర‌భావ‌శీల ధోర‌ణిలో ప‌నిచేస్తున్న దాఖలాలు లేవు.ఈ ద‌శ‌లో కొత్త వాళ్ల‌ను ఎంట్రీ ఇవ్వ‌నీయ‌క, సీనియ‌ర్లే తాము ఢిల్లీకి పోతాం, చ‌క్రం తిప్పుతాం అంటుంటే ఎంత‌మందికి అని జ‌గ‌న్ బుజ్జ‌గించ‌గ‌ల‌ర‌ని?


ప‌ద‌వుల విష‌య‌మై ఇప్ప‌టికిప్పుడు ఏమీ తేల‌కపోయినా వైవీ లాంటి వారి హంగామా ఎప్పుడూ ఉంటుంది.రాజ్య‌స‌భ టికెట్ అన్న‌ది ఎవరికి ఇవ్వాలో త‌మ‌కు తెలుసు అని, బ‌య‌ట వాళ్ల‌ను పిలిచి టికెట్ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు. బాగుంది..క‌ష్ట‌ప‌డే వారికే ప‌ద‌వులు అని కూడా అంటున్నారు.ఇది ఇంకా బాగుంది.వైసీపీలో ప‌ద‌వులు వచ్చిన వారి జాబితాలో కులం, ప్రాంతం కాకుండా వారి క‌ష్టానికే ప్రాధాన్యం ఇచ్చిన సంద‌ర్భాలు ఎన్నో వైవీనే చెప్పాలి.

వ‌చ్చే జూన్ లో ఖాళీ కానున్న రాజ్య సభ సీట్ల‌కు సంబంధించి ఇప్ప‌టి నుంచే మంత‌నాలు మొద‌ల‌య్యాయి.వైసీపీకి సంబంధించి ప‌లువురు ఆశావ‌హులు బ‌రిలో ఉన్నారు. దీంతో వీటిని ఎవ‌రితో భ‌ర్తీ చేస్తారో అన్న మీమాంస ఒక‌టి న‌డుస్తోంది. ఎప్ప‌టి నుంచో రాజ్య‌స‌భ‌కు పంపాల‌ని శ్రీ‌కాకుళం మ‌హిళా నేత కిల్లి కృపారాణి విష‌య‌మై అధినేత ఆలోచిస్తున్నారు.ఆమెను రాజ్య‌స‌భ‌కు పంపండంతో మ‌హిళ‌ల‌కు స‌ముచిత స్థానం ఇచ్చిన వాడిని అవుతాన‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు.ఆమె అయితే దేశ రాజ‌కీయాల్లో పార్టీ వాయిస్ గ‌ట్టిగా వినిపించ‌గ‌ల‌ర‌ని జ‌గ‌న్ ముందునుంచి ఓ స‌ద్భావ‌న‌తో ఉన్నారు. ఇక వైవీ కూడా రాజ్య‌స‌భ సీటే ఆశిస్తున్నారు. టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి క‌న్నా రాజ్య‌స‌భ సీటే ముఖ్య‌మ‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. కానీ జ‌గ‌న్ ఆయ‌న విష‌య‌మై మొద‌ట్నంచీ సానుకూలంగా లేరు. దీంతో వైవీ ఆశ‌లు నెర‌వేరేలా లేవు.



మరింత సమాచారం తెలుసుకోండి:

ycp