ప్ర‌పంచ దేశాల‌లో భార‌త్ పాస్‌పోర్టు విలువ రోజు రోజుకు పెరుగుతుంది. వీసా లేకుండా మ‌రిన్నీ దేశాల‌కు వెళ్లే విధంగా భార‌త్ పాస్ పోర్ట్ ర్యాంకుల‌ను సాధించింది. తాజాగా విడుద‌ల చేసిన జాబితాలో స్టాండెడ్ పాస్‌పోర్ట్‌ల జాబితాలో భార‌త్ ఏడు స్థానాల‌ను ఎగ‌బాకింది. గ‌త ఏడాది 90వ స్థానంలో ఉన్న భార‌త్, తాజా ర్యాంకింగ్‌లో 83వ స్థానముకు చేరుకున్న‌ది. దీంతో వీసా లేకుండా ఇండియా పాస్‌పోర్టుతో 60 దేశాలను  తిరిగి రావ‌చ్చు. ప్ర‌తీ ఏడాది ప్ర‌పంచ దేశాల్లో స్టాండెడ్ పాస్‌పోర్ట్ జాబితాను హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ అనే కంపెనీ ప్ర‌క‌టిస్తుంటుంది. ఈ త‌రుణంలో భార‌త్ సేకరించిన  స‌మాచారం మేర‌కు హెన్లీ కంపెనీ 2022లో 199 దేశాల‌కు సంబంధించిన జాబితాను విడుద‌ల చేసింది.

 ఈ పాస్ పోర్టు జాబితాలో జ‌పాన్‌, సింగ‌పూర్ దేశాలు మొద‌టిస్థానంలో ఉండ‌గా.. ఈ రెండు దేశాల పాస్‌పోర్టుల‌తో వీసా లేకుండా 192 దేశాల్లో ప్ర‌యాణించే వెసులుబాటు ఉన్న‌ద‌ని తెలిపింది. ఇక జ‌ర్మ‌నీ, ద‌క్షిణ‌కొరియా పాస్‌పోర్టులు ద్వితీయ స్థానాన్ని ద‌క్కించుకొన్నాయి. అదేవిధంగా ఈ జాబితాలో ఫిన్లాండ్‌, ల‌క్సెంబ‌ర్గ్‌, స్పెయిన్ దేశాలు 3వ స్థానం ద‌క్కించుకున్నాయి. 4వ స్థానంలో ఫ్రాన్స్‌, నెద‌ర్లాండ్‌, స్వీడ‌న్‌, డెన్మార్క్ దేశాలు నిలిచాయి.

అదేవిధంగా 6వ‌స్థానంలో అమెరికా, బ్రిట‌న్‌, న్యూజిలాండ్‌, నార్వే, స్విట్జ‌ర్లాండ్ దేశాలున్నాయి. గ‌త సంవ‌త్స‌రం ఈ దేశాలు 8వ స్థానంలో నిలిచాయి.  ఇక వీసా లేకుండా 180 దేశాల్లో తిరిగి రావ‌చ్చు. 7వ స్థానంలో ఆస్ట్రేలియా, కెన‌డా, గ్రీకు, మాల్టాలు నిలువ‌గా.. పోలాండ్, హంగ‌రీలు 8వ స్థానం ద‌క్కించుకున్నాయి. 9వ స్థానంలో లిథువేనియా, స్లోవేకియా ఉండ‌గా.. 10వ స్థానంలో ఎస్టోనియా, లాట్వియా, స్లోవేనియాలున్నాయి. ఇక 2022 జాబితాలో యూర‌ప్ దేశాల‌కు చెందిన పాస్ పోర్ట్‌లే ఎక్కువ ఉన్నాయి. అర‌బ్ దేశాల‌లో యూఏఈ గోల్డెన్ వీసా 15వ స్థానం, చైనా 64వ స్థానం ఉండ‌గా.. పొరుగు దేశ‌మైన పాకిస్తాన్ 108వ స్థానంలో ఉన్న‌ది.


మరింత సమాచారం తెలుసుకోండి: