ఒమిక్రాన్ రకం ఊపిరితిత్తులపై చాలా తక్కువ ప్రభావం చూపుతోందని ఏషియన్ ఇన్ స్టిట్యూషన్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యులు స్పష్టం చేశారు. చాలా మందిలో స్వల్ప లక్షణాలే ఉన్నాయన్నారు. 95శఆతం మంది మూడు నుంచి నాలుగు రోజులకే కోలుకుంటున్నారన్నారు. ఒమిక్రాన్ ఎంత వేగంగా వ్యాపస్తుందో అంత వేగంగా తగ్గుతుందన్నారు. మార్చి నెల చివరికి ఎండమిక్ స్థాయికి చేరి.. సాధారణ దగ్గు, జలుబు లక్షణాలకే పరిమితం కావొచ్చాన్నారు ఏఐజీ డాక్టర్లు.

ఇక అమెరికాలో ఆందోళనకర స్థాయిలో విజృంభిస్తున్న కోవిడ్ ను కట్టడి చేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఆర్మీ వైద్యులను రంగంలోకి దించుతున్నారు. వైరస్ కట్టడికి వెయ్యి మంది మిలటరీ వైద్య సిబ్బందిని దేశవ్యాప్తంగా మోహరిస్తామన్నారు. ప్రజలు ఇంట్లోనే టెస్ట్ చేసుకునేలా 100కోట్ల ర్యాపిడ్ కిట్లను, రక్షణ కల్పించే ఎన్95 మాస్కులను ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రకటించారు.

మరోవైపు మన పార్లమెంట్ లో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 850కి చేరగా.. వీరిలో 250మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. ఎలాంటి లక్షణాలు లేనివారే విధులకు రావాలన్న అధికారులు.. లక్షణాలు ఉంటే రావొద్దన సూచించారు. అటు ఈ నెల 31నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 30వేల 718 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో తాజాగా 30మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 93వేల 407యాక్టివ్ కేసులుండగా.. పాజిటివిటీ రేటు ఏకంగా 30.64శాతానికి చేరి ఆందోళన కలిగిస్తోంది.


ఇక ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 38వేల 816 టెస్టులు చేయగా.. కొత్తగా 4వేల 528 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు కోవిడ్ తో మరణించారు. మరోవైపు 418 మంది పూర్తిగా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18వేల 313 కేసులున్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: