సాధారణం గా స్కూల్కు వెళ్లే విద్యార్థులు బాగా చదవడానికి ఎప్పుడూ ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి వారు మరింతగా రాణించడానికి ఉపా ధ్యాయులు విద్యార్థులకు కొన్ని బహుమతులు అందించడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఆటల పోటీలు కూడా నిర్వహిస్తూ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపుగా అందరూ ఉపాధ్యాయుల నుంచి చిన్న చిన్న బహుమతులు తీసుకునే ఉంటారు. ఇలా ఉపా ధ్యాయులు ఇచ్చే చిన్ని బహుమతులు విద్యార్థుల్లో ఎంతగానో స్ఫూర్తిని నింపుతూ వుంటాయి.


 రానున్న రోజుల్లో బాగా రాణిస్తే ఇక మరిన్ని బహుమతులు అందు కోవచ్చు  అని అటు విద్యార్థులు కూడా భావిస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు దాదాపుగా అందరికీ స్కూల్ లైఫ్ లో బాగా చదివి నప్పుడు గాని లేదా ఆటల్లో ఫస్ట్ ప్రైస్ గెలుచు కున్నప్పుడు గాని   బుక్కులు పెన్నులు లేదా మెడల్స్ లాంటివి బహుమతులు ఇవ్వడం ఇప్పటి వరకు చూశాము. దాదాపుగా అందరూ స్కూల్ చదువుల సమయం లో ఇలాంటి బహుమతులు అందుకుని ఉంటారు. కానీ ఇక్కడ  చదువుల్లో రాణించిన విద్యార్థులకు విచిత్రమైన బహుమతులు ఇవ్వడం మొదలు పెట్టారు పాఠశాల యాజమాన్యం.


 పుస్తకాలు మెడల్స్ కాదు ఏకంగా పందులను బహుమతులుగా ఇస్తున్నారు. మీరు వింటున్నది నిజమే చైనా లోని ఒక పాఠశాలలో పందులను చదువుల్లో బాగా రాణించిన విద్యార్థులకు బహుమతులు ఇస్తున్నారు పాఠశాల యాజమాన్యం. అయితే పందుల పెంపకం కారణం గా భారీగా ఆదాయం పొందే అవకాశం ఉంది అంటూ చెబుతున్నారు. తద్వారా ఇలాంటి బహుమతులు ఇవ్వడంతో ఒకవైపు ఆర్థికం గా మరోవైపు చదువుల్లో కూడా ప్రోత్సాహం అందించినట్లు అవుతుంది అని పాఠశాల యాజమాన్యం వివరణ ఇస్తూ ఉండడం గమనార్హం. ఏదేమైనా విద్యార్థులకు పందులు బహుమతులు ఇవ్వడం మాత్రం హాట్ టాపిక్ గా మారి  పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: