దేశ‌వ్యాప్తంగా నిత్యం కొవిడ్ కేసులు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల‌లో నైట్ క‌ర్ప్యూ, లాక్‌డౌన్ వంటివి నిర్వ‌హిస్తున్నా.. కేసులు మాత్రం పెర‌గ‌కుండా ఆగ‌డం లేదు. ఈ కరోనా కార‌ణంగా 2020, 2021 విద్యాసంత్స‌రంలో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌కుండానే అంద‌రినీ పాస్ చేయించింది ప్ర‌భుత్వం. ముఖ్యంగా అన్నింటినికి ముఖ్య‌మైన ప‌ద‌వ‌త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ఈ ఏడాది కూడా వాయిదా ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. ప‌రీక్ష‌లు జ‌రుగుతాయో లేదో అనే అనుమానాన్ని విద్యార్థులు వ్య‌క్తం చేస్తున్నారు. కొంత మంది విద్యార్థులు జ‌న‌వ‌రి 30 వ‌ర‌కు పాఠ‌శాల‌ల‌కు సెల‌వులు అనే వార్త తెలియగానే సంతోష‌ప‌డుతున్నారు.

మ‌రికొంద‌రు విద్యార్థులు మాత్రం పాఠ‌శాల ఉంటేనే బాగుండు.. కానీ ఏమి చేస్తం అంత క‌రోనా మ‌హిమ అని పేర్కొంటున్నారు. క‌రోనా కేసులు విజృంభిస్తుండ‌డంతో తెలంగాణ ప్ర‌భుత్వం సంక్రాంతి సెల‌వుల‌ను మూడు రోజుల ముందుకు జ‌రిపి జ‌న‌వ‌రి 08 నుంచి 16 వ‌ర‌కు సెల‌వులు ఇచ్చింది. అయితే జ‌న‌వ‌రి 17న స్కూల్స్‌, క‌ళాశాల‌లు, యూనివ‌ర్సిటీలు తెర‌వాల్సి ఉన్న‌ది. కానీ కొవిడ్ కేసులు త‌గ్గ‌క‌పోవ‌డంతో ఈనెల 30 వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్టు సీఎస్ సోమేష్ కుమార్ అధికారికంగా ప్ర‌క‌టన చేసారు. వైద్యారోగ్య శాఖ కూడా విద్యార్థుల‌కు సెల‌వుల‌ను పొడిగించాల‌ని సూచించిన‌ట్టు స‌మాచారం.

ఇప్ప‌టికే క‌రోనా కార‌ణంగా రెండేండ్లు విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌కుండానే ఉన్నాయ‌ని.. మ‌ర‌ల ఈసారి కూడా అదే ప్ర‌భావం వ‌స్తే.. విద్యార్థుల బంగారు భ‌విష్య‌త్ కు ఇబ్బందులు ఎదురు అవుతాయ‌ని ప‌లువురు త‌ల్లిదండ్రులు పేర్కొంటున్నారు. పాఠ‌శాల‌ల‌ను తెరిచి కొవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచిస్తున్నారు.ముఖ్యంగా వైన్స్ షాపుల‌ను తెరిస్తే ఎక్కువ‌గా క‌రోనా సోకే ప్ర‌మాదం ఉందని ప‌లువురు పేర్కొంటున్నారు. ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల వ‌ల్ల ఇబ్బందులుంటాయి. ఆఫ్ లైన్ త‌ర‌గ‌తులే మిన్న అని ప‌లువురు విద్యార్థులు, త‌ల్లిదండ్రులు పేర్కొంటున్నారు.

మ‌రికొంత మంది విద్యార్థులు ఆన్‌లైన్ బెట‌ర్‌.. క‌రోనా స‌మ‌యంలో అని పేర్కొంటున్నారు. జ‌న‌వ‌రి 30 త‌రువాత మ‌ర‌ల పొడిగింపు ఉంటుందా లేదా అనేది మాత్రం క్లారిటీ లేదు. ఆన్‌లైన్ భోద‌న పెద్ద స‌మ‌స్య అని పేర్కొంటున్నారు. ముఖ్యంగా ప్ర‌భుత్వ క‌ళాశాలల్లో  ప‌లు చోట్ల వ‌స‌తులు లేక ఇబ్బందులు ఎదుర‌వుతాయి అని విద్యార్థులు వాపోతున్నారు.  మొత్తానికి క‌రోనా, ఒమిక్రాన్ విద్యార్థుల భ‌విష్య‌త్‌పై చెల‌గాటం ఆడుతున్నాయి. మ‌రి ఈ సారైనా విద్యార్థుల‌కు వార్షిక ప‌రీక్ష‌లు జ‌రుగుతాయా.. లేక గ‌త రెండు సంవ‌త్స‌రాల మాదిరిగానే కొన‌సాగుతాయా అనేది మ‌రికొద్ది రోజుల్లో తేల‌నుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: