కార్య‌క‌ర్త‌లే పార్టీకి పెన్నిధి అంటూ.. ఇటీవ‌ల కాలంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌దేప‌దే చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఇటీవ‌ల ఆయ‌న ఎక్క‌డ మాట్లాడినా.. కార్య‌క‌ర్త‌ల‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. అదేస‌మ‌యంలో ఆయ‌న కార్య‌క‌ర్త‌ల‌కు.. పార్టీలో ప‌ద‌వులు ఇస్తాన‌ని కూడా చెబుతున్నారు. అయితే.. వీటిని న‌మ్మేందుకు కార్య‌క‌ర్త‌లు సిద్ధంగా లేర‌ని.. పార్టీలోని ఓ వ‌ర్గం ప్ర‌చారం చేస్తోంది. పార్టీ ఓడిపోయిన‌ప్పుడు.. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు మాత్ర‌మే .... చంద్ర‌బాబుకు వారు గుర్తుకు వ‌స్తార‌ని.. అధికారంలోకి వ‌చ్చాక వారిని మ‌రిచిపోతార‌ని చెబుతున్నారు.

అయితే.. ఇప్పుడు ఈ కామెంట్ల‌ను తోసిపుచ్చేలా చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. తాజాగా గుంటూరు జిల్లా ప‌ల్నాడులో చంద్ర‌య్య అనే కార్య‌క‌ర్త హ‌త్య‌కు గురైన నేప‌థ్యంలో ఆయ‌న శ‌వాన్ని మోసి.. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను తాను ఇస్తున్న ప్రాధాన్యాన్ని..చంద్ర‌బాబు చెప్ప‌క‌నే చెప్పార‌ని.. సీనియ‌ర్లు చెబుతున్నారు. అయితే.. ఇలాంటి ప్ర‌యోగాలు చేయ‌డంలో చంద్ర‌బాబు సిద్ధ‌హ‌స్తుడ‌ని.. ఇప్పుడు పార్టీ క‌ష్టా ల్లో ఉంది కాబ‌ట్టి.. తాను న‌మ్ముకున్న నాయ‌కులు.. పార్టీకి ప‌నిచేయ‌డం లేదు కాబ‌ట్టి.. ఆయ‌న ఇలా చేస్తున్నార‌నే వాద‌న కూడా ఉంది.

ఈ క్ర‌మంలో చంద్ర‌య్య పాడె మోసిన‌ వ్య‌వ‌హారంపైనా .. అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ``కార్య‌క‌ర్త‌లు పార్టీ కి అవ‌స‌రం. ఈ విష‌యా న్ని మా నాయ‌కుడు ఇప్పుడే గుర్తించారా? `` అని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రికొంద‌రు.. పార్టీకోసం.. ప్రాణ‌త్యాగం చేసిన వారు చాలా మంది ఉన్నార ని.. అయితే.. అధికారంలో ఉన్న‌ప్పుడు.. క‌నీసం ఆయా కుటుంబాల‌ను చంద్ర‌బాబు ఎందుకు ప‌ట్టించుకోలేదు.. అని ప్ర‌శ్నిస్తున్న వారు కూడా క‌నిపిస్తున్నారు.

ఇదంతా కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కుమారుడు లోకేష్‌ను అధికారంలోకి తెచ్చుకునేందుకు చేస్తున్న ప్య‌త్నంగానే వారు భావిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని మ‌రికొంద‌రు చెబుతున్నారు. టీడీపీ వాళ్లు మాత్రం త‌మ అధినేత పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్ప‌టి నుంచి క‌ష్ట‌ప‌డుతూనే ఉన్నార‌ని చెపుతున్నారు. ఏదేమైనా.. చంద్ర‌బాబు ఇప్పుడు చేసిన ప్ర‌యోగం ఏమేర‌కు ఫ‌లితాన్ని ఇస్తుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: