తాజాగా ఏపీలో చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో చిరంజీవి ఇమేజ్ డ్యామేజీ అవుతుందా? అనే విష‌యం సోషల్ మీడియాలోను, మేధావుల మ‌ధ్య కూడా తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ‌గా మారింది. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ఏపీలో ఇప్పుడు గ‌డ్డు రోజులు న‌డుస్తున్నాయ‌ని ఆ వ‌ర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి స‌మ‌యంలో ప‌రిశ్ర‌మ‌కు ఆదాయం వ‌స్తుంది. గ‌తంలో భారీగా సంక్రాంతిపై ఆశ‌లు ఉండేవి. అయితే.. ఇప్పుడు.. ఒమిక్రాన్‌వైర‌స్ స‌హా.. ఇత‌ర‌త్రా కార‌ణాల‌తో పెద్ద సినిమాలు వాయిదా ప‌డ్డాయి. ఇక‌, నిబంధ‌న‌ల పేరుతో ఏపీ ప్ర‌భుత్వం ధియేట‌ర్ల‌పై కొర‌డా ఝ‌ళిపిస్తోంది. దీంతో ధియేట‌ర్లు మూత‌బ‌డ్డాయి.

అదేస‌మ‌యంలో టికెట్ల ధ‌ర‌ల‌ను కూడా భారీగా త‌గ్గించేశారు. ఈ ప‌రిణామాలతో టాలీవుడ్ ఇబ్బందుల్లో చిక్కుకుంది. దీనిపై ఇప్ప‌టికే మంత్రి పేర్ని నానితో దిల్‌రాజు వంటి కీల‌క నిర్మాత‌లుచ‌ర్చలు కూడా జ‌రిపారు. అదేస‌మ‌యంలో ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ కూడా చ‌ర్చించారు. అయితే.. ఇది జ‌రుగుతున్న క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా వ‌చ్చి.. సీఎంను క‌లుసుకున్నారు. సీనిమా స‌మ‌స్య‌ల‌పైనే చ‌ర్చించాన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. అయితే.. ఆయ‌న అందుకు రాలేదంటూ.. కొన్ని మీడియాల్లో క‌థ‌నాలు వ‌చ్చాయి. సినిమా స‌మ‌స్య‌ల కంటే కూడా ఆయ‌న రాజ్య‌స‌భ‌టికెట్ కోసం వ‌చ్చి ఉంటార‌నే చ‌ర్చ సాగింది.

దీంతో ఇది చిరు కు అన్ని విధాలా డ్యామేజీ అవుతుంద‌ని.. సోష‌ల్‌మీడియాలో చ‌ర్చ సాగుతోంది. సినీ ప‌రిశ్ర‌మ ఒక‌వైపు ఇబ్బందుల్లో ఉంటే.. చిరు ఇలా సొంత లాభం కోసం.. రాజ్య‌స‌భ టికెట్ కోసం పాకులాడ‌తారా? అంటూ... అప్పుడే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అదేస‌మ‌యంలో.. రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటాన‌ని చెప్పిన చిరు ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నార‌ని.. మ‌రికొంద‌రు ప్ర‌శ్న‌లు గుప్పించారు.

అయితే.. ఇవ‌న్నీ స‌ర్వ‌సాధార‌ణ‌మేన‌ని.. ఎప్ప‌టిక‌ప్పుడు మార్పులు స‌హ‌జ‌మ‌ని.. చిరు రాజ్య‌స‌భ సీటు తీసుకుంటే త‌ప్పులేద‌ని.. కొంద‌రు వ్యాఖ్యానించారు. ఇలా.. చిరు వ్యవ‌హారంపై అనేక రూపాల్లో అనేక కోణాల్లో చ‌ర్చ‌లు జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. అయితే.. త‌ప్పులేద‌నే వారు ఎక్కువ మంది ఉండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: