తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న సంగతి మనందరికీ విధితమే. ఈ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే కేసీఆర్ సర్కార్ సంక్రాంతి పండుగ సెలవులను జనవరి 8వ తేదీ నుంచి జనవరి 16వ తేదీ వరకు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇవాళ్టితో ఆ సెలవుల గడువు ముగిసింది. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడా తగ్గడం లేదు. ఇలాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థలకు సంబంధించిన సంక్రాంతి హాలిడేస్ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కార్. జనవరి 30వ తేదీ వరకు విద్యాసంస్థలకు హాలిడేస్ ఇస్తున్నట్లు ప్రకటన చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న  సెలవుల ప్రకటన నిర్ణయాన్ని తీవ్ర స్థాయిలో ఖండించినట్లు స్పష్టం చేసింది తెలంగాణ రాష్ట్ర  ట్రస్మా సంస్థ. 

 అవగాహన లేక విచ్చలవిడిగా కోవిడ్ వాహకాలుగా తిరిగి, కొవిడ్ కెంద్రాలుగా తయారు చేస్తున్నటు వంటి వారిని పట్టించుకోకుండా (వరుసగా*...మార్కెట్స్, సినిమా థియేటర్స్, మాల్స్, వైన్స్, బార్స్, క్లబ్స్, ప్రజల కూడిక, పోలిటికల్ సమూహంలను), అవగాహనా ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ...విద్యానందించే విద్యాసంస్థలను  మూసివెయటం, పిల్లల చదువు బందు పెట్టడం చాలా అన్యాయం అని మండిపడ్డారు  తెలంగాణ రాష్ట్ర  ట్రస్మా అధ్యక్షులు యాదగిరి శెఖర్ రావు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సెలవుల ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర  ట్రస్మా.  సెలవుల ప్రకటనను ట్రస్మా రాష్ట్ర సంఘం ముక్త కంఠముతో తీవ్రంగ ఖండిస్తున్నామన్నారు తెలంగాణ రాష్ట్ర  ట్రస్మా. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని  ఒక పత్రికా ప్రకటనలో రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శెఖర్ రావు, సాదుల మధుసుధన్ రాష్ట్ర ప్రధాన కార్యధర్శి మరియు ఐవి రమణా రావు రాష్ట్ర కోశాధికారి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: