గత ఎన్నికల ఫలితాలు ఏ మాత్రం రిపీట్ కాకుండా...ఈ సారి వైసీపీకి చెక్ పెట్టి అధికారం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఈ సారి మాత్రం అధికారం దక్కకపోతే ఏం జరుగుతుందో చంద్రబాబుకు బాగా తెలుసు..తనతో పాటు టీడీపీ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారుతుంది. పైగా పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎక్కువ వినబడుతుంది. కాబట్టి ఈ సారి గెలవడం అనేది బాబుకు చాలా ముఖ్యం...అందుకే ప్రతి నియోజకవర్గంపై ఫోకస్ పెట్టి, గెలిచే నాయకులకు బాధ్యతలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ సరిగ్గా పనిచేయని నేతలు ఉంటే వారిని పక్కన పెట్టేసి, కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు.

ఇప్పటికే పలు నియోజకవరాల్లో మార్పులు చేసిన బాబు, ఇంకా పలు నియోజకవర్గాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఇదే క్రమంలో దివంగత నేత, మాజీ ఎంపీ ఎన్ శివప్రసాద్ అల్లుడు నరసింహ ప్రసాద్‌కు ఇచ్చే సీటు విషయంలో క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. శివప్రసాద్...చంద్రబాబు బాల్య స్నేహితుడు అనే విషయం తెలిసిందే...ఇద్దరిది చిత్తూరు జిల్లానే. ఇక కుప్పంలో చంద్రబాబు బరిలో ఉంటే, శివప్రసాద్..చిత్తూరు ఎంపీగా పోటీ చేసేవారు...కుప్పంలో చంద్రబాబుకు వచ్చే మెజారిటీనే శివప్రసాద్ గెలుపుకు సాయపడేది...అలా 2009, 2014 ఎన్నికల్లో గెలిచారు...కానీ 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన అనారోగ్యంతో చనిపోయారు...అక్కడ నుంచి చిత్తూరు పార్లమెంట్‌లో టీడీపీకి నాయకుడు లేరు.

ఇక ఈ సీటు కోసం శివప్రసాద్ అల్లుడు నరసింహాప్రసాద్ ట్రై చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది....గత ఎన్నికల్లో ఈయన రైల్వే కోడూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు...అదేమో వైసీపీ కంచుకోట....అక్కడ టీడీపీకి ఛాన్స్ దొరకడంలేదు. నరసింహ ఎన్ని రకాలుగా జానపద పాటలతో పోరాడుతున్న సరే ఉపయోగం ఉండటం లేదు...అందుకే ఆయన సీటు మార్చుకోవాలని అనుకుంటున్నారు...తన మామ సీటు చిత్తూరు ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్నారు. కానీ  సీటు విషయంలో బాబు మాత్రం ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. మరి త్వరలో ఇస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: