ఎక్కడో స్వచ్చేస్తే ఇంకెక్కడో బల్బు వెలిగినట్లు ఒక్కోసారి అనాలోచితంగా చేసిన తప్పే తర్వాత రోజుల్లో మనల్ని వెంటాడుతుంది. ఇపుడు కేసీయార్ కు అదే విషయం అనుభవంలోకి వచ్చినట్లుంది. అధికారంలోకి వచ్చినపుడు చేసిన ఆ తప్పు ఇపుడు  ఆయన మెడకే చుట్టుకుంటోంది. ప్రత్యేక తెలంగాణా వచ్చిన తర్వాత కేసీయార్ సీఎం అయ్యారు. అయితే బొటాబొటిగా మాత్రమే టీఆర్ఎస్ కు సీట్లొచ్చాయి. దాంతో తన ప్రభుత్వం ఎప్పుడైతే పతనం అవ్వచ్చన్న భయంతో టీడీపీ ఎంఎల్ఏల పైన వల విసిరారు.




అప్పట్లో టీడీపీ తరపున గెలిచిన ఎంఎల్ఏలను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి లాగేసుకున్నారు. అంతటిటో ఆగితే బాగానే ఉండేది. ఆగకుండా తర్వాత కాంగ్రెస్ వైపు దృష్టిసారించారు. టీడీపీని చీలికలు పీలికలు చేసిన తర్వాత కాంగ్రెస్ ను కూడా అలాగే చేద్దామనుకున్నారు. చాలావరకు చేశారు కూడా. టీడీపీ అంటే ప్రాంతీయపార్టీ అందులోను ఆంధ్రోళ్ళపార్టీ అనే ముద్రుంది కాబట్టి కేసీయార్ వ్యూహాలు పలించాయి. కాంగ్రెస్ లో ఆ వ్యూహం పలించలేదు. ఇక్కడే కేసీయార్ తప్పుచేశారు.




తెలంగాణాలో తనకు ఎదురేలేకుండా చేసుకోవాలన్న ఆలోచనతో రెండు ప్రధాన పార్టీలైన టీడీపీ, కాంగ్రెస్ ను చీల్చి చెండాడారు. అయితే ఊహించని రీతిలో బీజేపీ పుంజుకున్నది. బలమైన ప్రతిపక్షాలు దెబ్బతినటంతో కేసీయార్ కు ఓట్లు వేయటం ఇష్టంలేని వాళ్ళు బీజేపీకి ఓట్లేశారు. దీని ఫలితంగానే 2019 ఎన్నికల్లో కమలంపార్టీ తరపున నలుగురు ఎంపీలు గెలిచారు.  కేంద్రంలో కూడా బీజేపీ బలంగా ఉండటంతో అప్పటి నుండే కేసీయార్ డౌన్ ఫాల్ స్టర్టయ్యిందని చెప్పాలి. టీడీపీ, కాంగ్రెస్ దెబ్బ కొట్టిన తర్వాత తనకు ఎదురే ఉండదని కేసీయార్ అనుకున్నారు.




కేసీయార్ ఒకలాగ ఆలోచిస్తే జనాలు మరోలాగ ఆలోచించారు. జనాలకు ఎపుడు ఓట్లేసేందుకు ప్రత్యామ్నాయం కావాలి. అంటే బీజేపీ ఎదుగుదలంతా కేసీయార్ స్వయంకృతమనే చెప్పాలి. తనంతట తానే కేసీయార్ బలమైన ప్రతిపక్షాన్ని తయారుచేసుకున్నారు. ఇపుడా బీజేపీని ఎలా తొక్కాలో తెలీక దిక్కులు చూస్తున్నారు. అప్పట్లోనే టీడీపీ, కాంగ్రెస్ జోలికి పోకుండా ఉండుంటే జనాలు బీజేపీవైపు చూసేవారుకారేమో.




టీడీపీ, కాంగ్రెస్ ను మ్యానేజ్ చేసినట్లు కేసీయార్ బీజేపీని మ్యానేజ్ చేయలేక కిందా మీదా అవుతున్నారు. టీడీపీని తరిమేసినా కాంగ్రెస్ జోలికి వెళ్ళకుండా ఉండుంటే సరిపోయేది. కానీ రెండు పార్టీలను అసలు లేకుండానే చేద్దామన్న ఆలోచన చివరకు బీజేపీ రూపంలో గట్టిగా తగులుకుంది. రేపటి ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందా రాదా అన్నది పాయింట్ కాదు. రేపు అధికారంలోకి రాకపోయినా ఇప్పటికన్నా మరింత బోపేతమవటం ఖాయం. ఇపుడే బీజేపీని ఎదుర్కునేందుకు అవస్తలు పడుతున్న కేసీయార్ రేపు ఇంకేమీ ఎదుర్కొంటారు ?

మరింత సమాచారం తెలుసుకోండి: