సాధారణంగా సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం ఏ రేంజిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా ఆంధ్రాలో అయితే ఇక సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు రంగురంగుల రంగవల్లులు గొబ్బెమ్మలు హరిదాసుల కీర్తనలతో పాటు కోళ్ల పందాలు ఎద్దుల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక ప్రజా ప్రతినిధులు సామాన్యులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా  కోళ్ల పందాల లో పాల్గొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి వెళ్లి మరి ఈ కోళ్ల పందాల లో పాల్గొనడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగ మూడు రోజుల పాటు కోళ్ల పందేలు ఎంతో యదేచ్ఛగా జరిగాయన్నది అందరికీ తెలిసిందే. భోగి సంక్రాంతి కనుమ మూడు రోజులపాటు కోళ్ల పందాలు ఎద్దుల పోటీలు జరిగాయి. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి తరలి వచ్చి మరీ జనాలు కోళ్ల పందాలు చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపారు అనే చెప్పాలి. ఇక ఈ నెల 14వ రోజున భోగి పండుగ తో మొదలుపెట్టి చివరికి ఆదివారం కనుమ వరకూ జరిగిన ఈ పండుగ జాతర కాస్త ఇక ఇప్పుడు ముగిసింది అనే చెప్పాలి. మొన్నటివరకు జనాలతో కిక్కిరిసిపోయిన ప్రాంతాలు ఇక ఇప్పుడు కోళ్ల పందాలు ముగియడంతో ఖాళీగానే కనిపిస్తున్నాయి.



 కోళ్ల పందాలలో విజయం సాధించి భారీగా లాభాలు పొందాలి అనుకుని ఎన్నో రోజుల నుంచి కోళ్లను సిద్ధం చేస్తూ ఇటీవలే పందాలలో గెలిచినవారు.. ఇప్పుడు కోళ్ల కి రెస్ట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇక హోరాహోరీగా కోళ్ల పందాలలో పోటీపడిన కోళ్లు కూడా ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోబోతున్నాయి. అదే సమయంలో ఇక ఈ కోళ్ళ పందాలలో దాదాపు వందల కోట్లు చేతులు మారాయి అన్న ఒక టాక్ కూడా వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఇక ఇటీవల కోళ్ల పందాలు లో గెలుపొందిన వారు పండుగ ముగియడంతో డబ్బులు లెక్క పెట్టుకునే పనిలో బిజీగా మారిపోతారు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: