ఈ సృష్టిలో ఎప్పుడూ ఏదో ఒక వింత మనిషిని ఆశ్చర్యపరుస్తునే ఉంటుంది.. ఎంతో మంది శిశువులు సాధారణంగా కాకుండా భిన్నమైన రూపంతో పుట్టడం ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. అయితే జన్యుపరమైన లోపాల కారణంగానే ఇక శిశువు  వింతగా జన్మించింది అని డాక్టర్లు చెప్పి సరిపెట్టుకుంటారు కానీ జనాలు మాత్రం ఇలా వింత శిశువు జన్మించడానికి వెనుక ఏదో పెద్ద కారణమే ఉంది అంటూ ఆలోచనలో పడి పోతూ ఉంటారు. ఇలా ఇప్పటివరకు ఎన్నో సార్లు వింత శిశువు జన్మించిన సందర్భాలు చాలానే సోషల్ మీడియాలో కి వచ్చాయి..


 కేవలం మనుషుల విషయంలోనే కాదు ఏకంగా జంతువుల విషయంలో కూడా ఇలాంటివి చాలానే జరిగాయి అన్న విషయం తెలిసిందే.  కొన్ని కొన్ని సార్లు బ్రహ్మం గారు కాలజ్ఞానం లో చెప్పిన విధంగా ఒక జంతువు కడుపులో ఇంకో జంతువు జన్మించడం లాంటి ఘటనలు కూడా తెరమీదకు వచ్చాయి. అంతేకాదు చిత్రవిచిత్రమైన రూపంలో జంతువులు జన్మిస్తూ వుంటాయ్. ఇక ఇలాంటివి జరిగినప్పుడు కూడా కేవలం జన్యుపరమైన మార్పుల కారణంగానే ఇక ఇలా వింత రూపంలో జంతువు జన్మించింది అని చెబుతూ ఉంటారు డాక్టర్లు. కానీ ఇలా వింతగా లేగదూడ జన్మించడానికి వెనుక కారణాలు వెతకడం ప్రారంభిస్తారు జనాలు. ఇక ఇప్పుడు ఇలాంటి ఘటన జరిగింది.



 చత్తీస్ ఘడ్ లోని రాజ్నంద్గావున్ జిల్లాలో వింత ఆవు దూడ జన్మించింది.. సాధారణంగా ఆవు దూడ కు రెండు కళ్ళు ఉంటాయి.. కానీ ఇటీవల జన్మించిన ఆవు దూడ కి  మాత్రం ఏకంగా మహా శివుడి లాగానే మూడు కళ్లు ఉన్నాయి. రెండు కళ్లు సాధారణంగానే ఉంటే ఇక మూడవ కన్ను  నుదిటిన ఉంది. అంతేకాకుండా ముక్కులో రెండు రంధ్రాలు కాదు ఏకంగా నాలుగు రంధ్రాలతో లేగ దూడ పుట్టింది. ఇక మకర సంక్రాంతి రోజునే ఈ లేగదూడ జన్మించడంతో సాక్షాత్ మహాశివుడు అంటూ అక్కడి ప్రజలందరూ భావిస్తున్నారు. అయితే పిండం సరిగా అభివృద్ధి చెందకపోవడం కారణంగానే జన్యులోపం  కారణంగా ఇలా వింత రూపంలో జన్మించి ఉంటుందని  వైద్యులు చెబుతున్నారు. ఏదేమైనా ఇక మూడు కళ్ళ తో పుట్టిన లేగదూడ స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఈ లేగదూడలను చూసేందుకు జనాలు భారీగా తరలివస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: