ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా విద్యాసంస్థలు మొత్తం మూతపడిన పరిస్థితి ఇప్పటిదాక 2-దశల కరోనా వైరస్ తో విద్యార్థులకు విద్యా సంస్థలకు మధ్య ఎంత దూరం కూడా పెరిగిపోయింది. కానీ ఇటీవలి కాలంలో కరోనా వైరస్ కేసులు సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టడంతో మళ్లీ విద్యాసంస్థలు యధావిధిగా నడవడం మొదలైంది. ఇక పరీక్షలు కూడా నిర్వహించేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. కానీ ఇలాంటి సమయంలోనే మళ్లీ కరోనా వైరస్ కేసులు వెలుగులోకి రావడం తో విద్యా సంస్థలు మూత పడాల్సిన  పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇక కరోనా వైరస్ ప్రభావం కారణంగా విద్యార్థులు చదువులకు దూరమయ్యే దుస్థితి ఏర్పడింది.



 రెండవ దశ కరోనా వైరస్ ప్రభావం తగ్గింది ఇక మా చదువులను సాఫీగా కొనసాగించవచ్చు అని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు విద్యార్థులు. ఇక అన్ని పరిస్థితులు చక్క బడుతున్నాయి అనుకుంటున్న సమయంలో మళ్లీ ఒకవైపు ఓమిక్రాన్ కేసులు పెరిగిపోవడం ఇంకోవైపు కరోనా వైరస్ కేసులు పెరిగిపోవడంతో విద్యా సంస్థలు మూతపడటం పరీక్షలు వాయిదా పడటం లాంటివి మరోసారి జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వాలు కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కఠిన ఆంక్షలు తీసుకొస్తున్నాయి.. ఇక ఇప్పుడు మరోసారి పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.


 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో కూడా పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కానీ అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఇటీవలే విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఎవియం రెడ్డి ప్రకటనలో అధికారికంగా తెలపడం గమనార్హం. దీంతో ఎంతోమంది విద్యార్థులు అందరికీ కూడా నిరాశే ఎదురైంది అని చెప్పాలి  ఈనెల 30వ తేదీ వరకు జరగబోయే అన్ని రకాల పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇక ఇప్పుడు వాయిదా పడిన పరీక్షలను  ఎప్పుడు నిర్వహించబోతున్నాము అన్న విషయాన్ని రానున్న రోజుల్లో ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: