ఇప్పటివరకు టీకా వేసుకుంటేనే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు కానీ ఇతర ఏ అవసరాలకు వెళ్లిన టీకా సర్టిఫికెట్ చూపించాలని వస్తున్న ఆరోపణలను కొట్టిపారేసింది కేంద్రం. టీకా తప్పనిసరి అవసరమా.. కరోనా వ్యాక్సిన్ తీసుకోలేదని మీ హక్కులను హరించి వేయవచ్చా.. కుదరనే కుదరదు వ్యాక్సిన్ తప్పనిసరి ఏమీ కాదని సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించింది కేంద్రం. ఇదే విషయంపై కేంద్రం స్పష్టం చేసింది. టీకా అనేది నిర్బంధం ఏమీ కాదు అంతా స్వచ్ఛందంగా అని నిర్ధారించింది.

 టీకా తప్పనిసరిగా తీసుకోవాలని, అందరికీ టీకా చేరాలనే ఉద్దేశంతో అలా మాట్లాడాను కానీ టీకా తీసుకోకపోతే మీ హక్కులను భంగం కలుగుతుందని  ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. దీని గురించి ఎలాంటి మార్గదర్శకాలు ప్రభుత్వం ఇవ్వలేదని, వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి ఏమీ కాదని, అందరూ తప్పనిసరిగా తీసుకోవాలని అలా అన్నారు  కానీ, టీకా అనేది వ్యక్తిగత అంశమని  ఇందులో ప్రభుత్వం ఏమాత్రం బలవంతపు జోక్యం చేసుకోదని తెలియజేసింది. ఓ వైపు కేంద్రం ఇలా చెబుతూ ఉండగా వాస్తవంగా చూస్తే పరిస్థితులు వేరే విధంగా ఉన్నాయి. స్థానిక సంస్థలు సంఘాలు, వివిధ కంపెనీలు తమ దగ్గర పనిచేసే వారు తప్పనిసరిగా టీకా తీసుకోవాలని స్పష్టం చేస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ వేసుకుంటేనే ఉద్యోగులకు ఇచ్చే ప్రయోజనాలన్నీ తగ్గిస్తున్నాయి. ఒక్క డోస్  వేసుకొని ఇంకో డోస్ వేసుకోకుండా ఉన్నవారికి రేషన్ దుకాణాలు గ్యాస్ ఏజెన్సీలు పెట్రోల్ పంపుల్లో సేవలు బంద్ చేయాలని కొన్ని జిల్లాలలో కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు ఘటనలు కూడా ఉన్నాయి. వ్యాక్సిన్ వేసుకొని ఉద్యోగులకు జీతాలు ఆపేసిన సంస్థలు కూడా ఉన్నాయి. ఏదైనా వ్యాధి సంభవిస్తే టీకా తీసుకోవడం అనేది తప్పనిసరి కాదు, అది వ్యక్తుల పై ఆధారపడి ఉంటుంది.

టీకా వేసుకుంటే  వైరస్ ప్రభావం తగ్గుతుంది. దీంతో ఇబ్బందులు లేకుండా ఉండాలని ప్రభుత్వం టీకాలు వేసుకోమని చెప్పింది కానీ టీకా వేసుకోవడం తప్పనిసరి లేదంటే హక్కులు హరిస్తామని ఎక్కడా చెప్పలేదని , కొన్ని రాష్ట్రాలు మాత్రం  కఠిన నిబంధనలు చేశాయని కేంద్రం మండిపడింది. వ్యాక్సిన్ తీసుకోకుండా వ్యాధి బారిన పడితే ప్రభుత్వం వారికి ఎలాంటి వైద్య సౌకర్యాలు కల్పించదని స్పష్టం చేయడం మంచి చర్య కాదని అన్నారు. అలాగే టీకా తీసుకొని వ్యక్తులకు బస్సులో ప్రయాణం లేదని మహారాష్ట్ర మున్సిపల్ టనే ప్రకటించడం ఆమధ్య వివాదాస్పదమైంది. ఇలాంటి విమర్శలు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న తరుణంలో కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: