టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో అధికార వైసీపీ హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే...పూర్తిగా జిల్లాలో వైసీపీ డామినేషన్ ఉంది. ఆ డామినేషన్ తగ్గించడానికి చంద్రబాబు నానా రకాలుగా కష్టపడుతున్నారు. పైగా తన సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా వైసీపీ హవా పెరిగిపోయింది. దీంతో వైసీపీ హవాని తగ్గించడానికి బాబు ప్రయత్నిస్తున్నారు. సరే ఎన్నికలకు ఇంకా ఎలాగో రెండున్నర ఏళ్ల సమయం ఉంది. ఈలోపు వైసీపీకి ఎలాగైనా చెక్ పెట్టాలని బాబు చూస్తున్నారు...జిల్లా మొత్తం కాకపోయిన కనీసం సగం నియోజకవర్గాల్లోనైనా సత్తా చాటితే కాస్త పరువు నిలబడుతుందని బాబు అంచనా.

ఇలా వైసీపీతో పోరాడుతున్న బాబుకు, పవన్ కల్యాణ్ రూపంలో కూడా తలనొప్పి ఎదురయ్యేలా ఉంది. అది ఎలా అంటే రాయలసీమలో జనసేనకు కాస్త ఎక్కువ ఓట్లు పడిన జిల్లా ఏదైనా ఉందంటే..అది చిత్తూరు జిల్లానే. గత ఎన్నికల్లో కొద్దో గొప్పో చిత్తూరులోనే జనసేనకు ఓట్లు పడ్డాయి. అందుకే ఈ జిల్లాలో ఇంకా ఎక్కువ బలపడాలని పవన్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. జిల్లాలో బలపడితే జనసేనకు కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది. అది ఎలా ఉంటే..ఒకవేళ టీడీపీతో గాని పొత్తు ఉంటే జనసేనకు రెండు, మూడు సీట్లు అడిగే అవకాశం ఉంటుంది.

ఒకవేళ పొత్తు లేకపోతే జనసేన వల్ల టీడీపీకే డ్యామేజ్ జరుగుతుంది. అంటే ఎటు వచ్చిన ఇక్కడ టీడీపీకే నష్టం. టీడీపీకి వచ్చే నష్టం ఏమో గానీ...ముందు జిల్లాలో బలం పెంచుకోవాలని జనసేన మాత్రం ప్రయత్నిస్తుంది.  గత ఎన్నికల్లో తిరుపతి, పుంగనూరు, పలమనేరు లాంటి స్థానాల్లో కాస్త బాగానే ఓట్లు తెచ్చుకుంది. పైగా నెక్స్ట్ పవన్ సైతం తిరుపతిలో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే చిత్తూరులో జనసేన ప్రభావం కాస్త ఉంటుంది. అలాగే పొత్తు ఉంటే కొన్ని సీట్లు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి చూడాలి బాబు సొంత జిల్లాలో పవన్ కల్యాణ్ ఏ మేర సత్తా చాటగలరో.

మరింత సమాచారం తెలుసుకోండి: