పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో బాగా ప్రభావితం చేసే కులాల్లో...క్షత్రియ కులం కూడా ఒకటి. జిల్లాలో కాపుల తర్వాత ఎక్కువ ప్రభావం చూపగల వర్గం ఇదే. పలు నియోజకవర్గాల్లో గెలుపోటములని తారుమారు చేసే కెపాసిటీ రాజులకు ఉంది. అయితే జిల్లాలో కాపులు, రాజులు గాని కలిస్తే ఆ పార్టీకి తిరుగుండదు. అందుకే గత ఎన్నికల్లో రెండు వర్గాలు వైసీపీ వైపే ఎక్కువ మొగ్గు చూపడంతో..ఆ పార్టీకి మంచి విజయాలు దక్కాయి.

అయితే రాజుల వర్గం నుంచి ఇద్దరు నేతలు సైతం విజయం సాధించారు. నరసాపురం అసెంబ్లీలో ముదునూరి ప్రసాద్ రాజు, ఆచంటలో చెరుకువాడ శ్రీరంగనాథరాజులు గెలిచారు. ఇక నరసాపురం ఎంపీగా రఘురామకృష్ణం రాజు గెలవడం, ఆయన వైసీపీకి యాంటీగా వెళ్ళడం...ఇలా అన్నీ విషయాలు తెలిసినవే. ఎమ్మెల్యేలుగా మాత్రం చెరుకువాడ, ముదునూరిలు గెలిచారు. ఈ ఇద్దరిలో చెరుకువాడ ఇప్పుడు మంత్రిగా ఉన్నారు...నెక్స్ట్ టర్మ్ ముదునూరికి మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతానికి ఈ ఇద్దరు రాజులు స్ట్రాంగ్‌గానే ఉన్నారు. అయితే నెక్స్ట్ గాని వీరికి చెక్ పెట్టాలంటే వెస్ట్‌లో పలు కీలక మార్పులు జరగాలి. ప్రస్తుతానికి వీరికి టీడీపీ గట్టి పోటీ ఇవ్వలేకపోతుంది. కొద్దో గొప్పో ఆచంటలో చెరుకువాడకు టీడీపీ నేత పితాని సత్యనారాయణ కాస్త పోటీ ఇస్తున్నారు. కానీ నరసాపురంలో టీడీపీ పరిస్తితి ఘోరంగా ఉంది. ఇక్కడ ఇంచార్జ్‌లు మారిన సరే ప్రయోజనం లేదు.


ఇక్కడ టీడీపీ కంటే జనసేన చాలా బలంగా ఉంది...వైసీపీకి జనసేన గట్టి పోటీ ఇస్తుంది. గత ఎన్నికల్లో కూడా జనసేన పోటీ ఇచ్చింది. అలా అని ఇక్కడ జనసేనకు పూర్తిగా వైసీపీని డామినేషన్ చేసే శక్తి లేదు. ఒకవేళ ఈ ఇద్దరు రాజులకు చెక్ పెట్టాలంటే టీడీపీ-జనసేనలకు విడివిడిగా వర్కౌట్ కాదు. పవన్, టీడీపీకి సపోర్ట్ ఇస్తేనే...అప్పుడు రెండు చోట్ల వైసీపీ రాజులకు చెక్ పెట్టొచ్చు. లేదంటే వారిని మళ్ళీ ఓడించడం కష్టం.

మరింత సమాచారం తెలుసుకోండి: