సాధారణంగా కమ్మ, బీసీ వర్గాలు తెలుగుదేశం పార్టీకి కాస్త ఎక్కువ మద్ధతు ఉంటాయనే సంగతి తెలిసిందే. అయితే కమ్మ వర్గం విషయం పక్కన పెడితే...2019 తర్వాత బీసీ వర్గం టీడీపీకి దూరమైన విషయం తెలిసిందే. బీసీ వర్గాలు కాస్త వైసీపీకి దగ్గరయ్యాయి. అయితే బీసీ ఓట్లని టీడీపీకి దూరం చేయడానికి జగన్...కొన్ని వ్యూహాలు వేసి సక్సెస్ కూడా అయ్యారు. అలా గత ఎన్నికల్లో పెనమలూరులో వైసీపీ సక్సెస్ అయింది.

పెనమలూరు అంటే కమ్మ, బీసీ వర్గాల డామినేషన్ ఉన్న నియోజకవర్గం. అందుకే ఇక్కడ టీడీపీకి గట్టి పట్టు ఉండేది. అయితే గత ఎన్నికల్లో టీడీపీ తరుపున కమ్మ వర్గానికి చెందిన బోడే ప్రసాద్ నిలబడితే...వైసీపీ నుంచి బీసీ వర్గానికి చెందిన  పార్థసారథి నిలబడ్డారు. దీంతో బీసీ ఓట్లు వైసీపీకి ఎక్కువ పడ్డాయి. పైగా ఎస్సీ ఓటింగ్ వైసీపీకి అనుకూలంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. దీంతో సారథి గెలిచేశారు.

అయితే ఇప్పుడు పెనమలూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా పార్థసారథి ఉన్నారు. ఈ రెండున్నర ఏళ్లలో ఆయన గొప్ప పనితీరు ఏమి కనబర్చలేదనే చెప్పొచ్చు. ఏదో ప్రభుత్వం తరుపున జరిగే కార్యక్రమాలు మినహా, ఇక్కడ ప్రజలకు ఒరింగింది ఏమి లేదు. దీంతో సారథిపై వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది. ఇటు టీడీపీ నేత బోడే ప్రసాద్ సైతం దూకుడుగా పనిచేస్తున్నారు. ఇలాంటి తరుణంలో టీడీపీకి ఎడ్జ్ వచ్చేసినట్లే. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ చోటుచేసుకుంది. నియోజకవర్గంలో ఉన్న బీసీ వర్గాల్లో ఇంకా ఎక్కువ మార్పులు వచ్చినట్లు కనిపించడం లేదు. ప్రభుత్వ పథకాల ప్రభావం వల్ల బీసీలు మారలేదు.

ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి పెనమలూరుకు చెందిన తుమ్మల చంద్రశేఖర్‌కు ఇచ్చింది. దీంతో కమ్మ వర్గంలో కాస్త మార్పులు కనిపిస్తున్నాయి. దీని వల్ల బోడే ప్రసాద్‌కు నష్టం జరిగేలా ఉంది. మరి నెక్స్ట్ కూడా ఇక్కడ టీడీపీకే ఇబ్బంది అయ్యేలా ఉంది.





మరింత సమాచారం తెలుసుకోండి: