ఒమిక్రాన్ ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్పుడు ప్ర‌తీ ఒక్క‌రినీ భ‌య‌బ్రాంతుల‌కు గురి చేస్తున్న‌ది. ఓ వైపు క‌రోనా మ‌హమ్మారి నుంచి కోలుకోక ముందే క‌రోనా మ‌రొక వేరేయంట్ రూపంలో ప్ర‌జ‌ల‌పై దాడి చేస్తుండ‌టంతో ప్ర‌జ‌ల‌కు కోలుకోలేని దెబ్బ‌మీద దెబ్బ ప‌డుతుంది. కొంత మంది జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా.. మ‌రికొంద‌రూ నెగ్లెట్ చేసి ఏకంగా ప్రాణాల మీదికే తెచ్చుకుంటున్నారు. యూకేలో మొత్తం జ‌నాభాతో పోల్చితే డ‌బుల్ వ్యాక్సినేష‌న్ తీసుకున్న వ్య‌క్తులు ఇప్ప‌టివ‌ర‌కు స‌గం కంటే త‌క్కువ వైర‌స్ క‌లిగి ఉన్నార‌ని ZOE అధ్య‌యం చేసే ఓ యాప్ చూపిస్తోంది.

ముఖ్యంగా  ఇంగ్లాడ్ దేశంలోని లండ‌న్‌లో జ‌న‌వ‌రి 01,2022లో వాట‌ర్‌లూ ప్లేస్‌లో జ‌రిగే 2022 లండ‌న్ నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌లకు ప్ర‌జ‌లు హాజ‌ర‌య్యారు. కొవిడ్ ఆంక్ష‌ల కార‌ణంగా ఈ ఏడాది ఈవెంట్‌ను స్కేల్ చేసారు. ప్ర‌భుత్వ అధికారిక గ‌ణాంకాల ప్ర‌కారం.. క‌రోనా వైర‌స్ కేసుల సంఖ్య వారం క్రితం ఉన్న స్థాయికి మ‌ళ్లీ స‌గం ప‌డిపోయింది. మ‌రొక 70,924 ల్యాభ్ దృవీక‌రించ‌బ‌డిన కొవిడ్ కేసులు న‌మోదు అయ్యాయి. వారం క్రితం 1, 41,472 మంది నుంచి త‌గ్గిపోయింది. ఈ నెలాఖ‌రు వ‌ర‌కు మంత్రుల స‌మ‌క్షంలో ప్లాన్ బీ ప‌రిమితులు ఎత్తివేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

బోరిస్ జాన్స‌న్ త‌ప్ప‌నిస‌రిగా మాస్క్ ధ‌రించ‌డం.. ఇంటి నుంచి ప‌ని చేయ‌డం, కొవిడ్ పాస్‌ల‌పై ప్లాన్ బీ నిబంధ‌న‌ల‌ను జ‌న‌వ‌రి 26న స‌మీక్షిస్తారు. గ‌త వారం ఒక స్వ‌ల్ప పెరుగుద‌ల మిన‌హా జ‌న‌వ‌రిలో ఇప్పుడు ప్ర‌తీరోజు కేసులు త‌గ్గాయి. అదేవిధంగా వెంటిలెట‌ర్లు అవ‌స‌రం అయ్యే వ్య‌క్తుల సంఖ్య గ‌త జులైలో అదేస్థాయికి ప‌డిపోయింది. వెంటిలెట‌ర్ చికిత్స అవ‌స‌రం అయ్యే ఇంటెన్సివ్ కెరీర్‌లో ఇప్పుడు సుమారు 800 లోపు రోగులున్నారు. ఇటీవ‌ల పెరిగిన క‌రోనా ఆసుప‌త్రి అడ్మిష‌న్లు కూడా ఇప్పుడు స్థిరీక‌రించ‌బ‌డ్డాయి. తాజా గ‌ణాంకాల ప్ర‌కారం.. 19,530 మంది మాత్ర‌మే యూకేలో ఆసుప‌త్రుల్లో ఉన్నారు.  ZOE కొవిడ్ స్ట‌డీ యాప్‌లోని ప్ర‌ధాన శాస్త్రవేత్త ప్రొఫెస‌ర్ టిమ్ స్పెక్ట‌ర్ మాట్లాడారు. త‌న బృందం ప‌రిశోధ‌న‌లో ఈశాన్య ఇంగ్లాండ్ మినహా యూహా అంతా ఒమిక్రాన్ కేసులు వేగంగా త‌గ్గుతున్నాయి అని వెల్ల‌డించారు. రోజుకు గ‌రిష్టంగా  ల‌క్ష నుంచి 2 ల‌క్ష‌ల వ‌ర‌కు త‌గ్గుతున్నాయి.

గ‌డిచిన 24 గంట‌ల‌లో మొత్తం 13,551 మంది డిశ్చార్జి కాగా.. యాక్టివ్ కేసులు 1,52,348 కి చేరుకొన్నాయి. ఇక చెన్నైలో 8,591 ఉండ‌గా.. తాజాగా ఇన్ఫెక్ష‌న్‌లు న‌మోద‌య్యాయి. న‌గరంలో 60,126 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటి రేటు 29.7 శాతానికి చేరుకున్న‌ది.  ఢిల్లీలో  సోమ‌వారం 12,527 కేసులు న‌మోదు కాగా.. 24 మ‌ర‌ణాల సంభ‌వించాయి. సానుకూలంగా రేటు 27.99 శాతం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 2,684 మంది క‌రోనా రోగులు ఆస‌ప‌త్రుల్లో చికిత్స పొందుతున్న‌ట్టు ఢిల్లీ ప్ర‌భుత్వం అధికారికంగా వెల్ల‌డించింది.  

తమిళనాడులో కొత్తరకం వేరియంట్ ఒమిక్రాన్ సహా సాధారణ కరోనా కేసులు పెరుగుతుండటంతో స్టాలిన్ సర్కారు అప్రమత్తమయ్యింది. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు మళ్లీ లాక్‌డౌన్‌ నిబంధనల్ని అమలులోకి తీసుకొచ్చింది. త‌మిళ‌నాడులో సోమ‌వారం 23,443 కేసులు న‌మోదు అయ్యాయి. కేసుల సంఖ్య 29,63,366కు పెరిగింది. యూకేలో 19,530 కేసులుంటే.. త‌మిళ‌నాడులో రోజుకు 20వేల‌కు పైగా కేసులు పెరగ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా దేశ రాజ‌ధాని అయిన ఢిల్లీలో ఉన్న కేసుల కంటే కూడా యూకేలో కేసులు ఉండ‌డం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: