మనం సినిమాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. దోపిడి దొంగలు రైళ్లల్లో ఎక్కువగా చోరీలకు పాల్పడుతు అంటారు. ఇక గూడ్స్ రైలులో ఏదైనా విలువైన వస్తువులు ఉన్నాయి అని తెలిసింది అంటే మాత్రం రైళ్లను మధ్యలో ఆపడం లేదా రైలు ఆగిన చోట దొంగతనాలకు పాల్పడటం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎంతో విలువైన వస్తువులను దోచుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. కేవలం సినిమాల్లోనే కాదు మన దేశంలో చాలా చోట్ల ఇలాంటి చొరీలు జరుగుతూ ఉంటాయి.  ప్రయాణికుల దగ్గర నుంచి విలువైన వస్తువులను దొంగలించి ఇక రైలు మధ్యలో ఆపి అక్కడి నుంచి పారిపోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే మనదేశంలో మాత్రమే కాదు అగ్రరాజ్యమైన అమెరికా లో కూడా లాంటి దొంగతనాలు ఎక్కడా తగ్గడం లేదు అన్నది తెలుస్తుంది.



 ఇటీవల కాలంలో అమెరికాలో ఇలాంటి దోపిడి దొంగలు పెరిగిపోయారు. దీంతో అటు ప్రభుత్వ అధికారులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కటి ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వడం సర్వసాధారణంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలా ఆన్లైన్లో ఇచ్చిన ఆర్డర్లను గూడ్స్ రైలు ద్వారా రప్పించడం లాంటివి చేస్తున్నాయి ఈ కామర్స్ సంస్థలు. కానీ ఈ కామర్స్ సంస్థలకు షాకిస్తున్న దొంగలు మాత్రం చోరీలకు పాల్పడుతున్నారని అన్నది తెలుస్తుంది. ఇలా రైళ్లలో తీసుకొస్తున్న వస్తువులను ఇక మధ్యలోనే దొంగలించడం కారణంగా అమెజాన్, ఫెడెక్స్ లాంటి ఈ కామర్స్ సంస్థలు భారీగా నష్టపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.



 ఇక ఇటీవలే రైల్వే పట్టాలపై భారీగా ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చిన ప్యాకేజీలు కనిపించడంతో ఇక రైల్వే అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే డ్రోన్ కెమెరా లతో ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేసినప్పటికీ ఇలాంటి దొంగతనాలు జరుగుతున్నాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇలా రైళ్లలో చోరీలు పాల్పడుతున్న వారిని పట్టుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నామని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఏదేమైనా అగ్రరాజ్యంలో కూడా ఇలాంటి వింత చోరీలు మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: