ప్రస్తుతం భారత్ ను కరోనా వైరస్ దశలవారీగా వణికిస్తూ నే  ఉంది. ప్రతి దశలో కూడా భారత్ లో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇలా కరోనా వైరస్ కేసుల సంఖ్య మాత్రం పెరిగిపోతుండటం ప్రస్తుతం అందరినీ భయాందోళనకు గురి చేస్తుంది అని చెప్పాలి. ఎంతోమంది వ్యాక్సిన్ వేసుకున్నప్పటికి వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా మహమ్మారి  వైరస్ మాత్రం పంజా విసురుతోంది. వెరసి రోజు రోజుకు వెలుగులోకి వస్తున్న కేసులు అందరిని భయపెడుతున్నాయి.


 అయితే ప్రస్తుతం కరోనా వైరస్ పై పోరాటం చేయడానికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం వ్యాక్సిన్ కరోనా వైరస్ పై పోరాటం చేయడానికి వ్యాధినిరోధక శక్తిని ఇస్తుంది తప్ప పూర్తిగా కరోనా వైరస్ ను నాశనం చేయదు అన్న విషయం తెలిసిందే. కేవలం శరీరంలో యాంటీబాడీలను వృద్ధి చేసి ఇక ఆ యాంటీబాడీలు శరీరంలోకి ప్రవేశించిన  వైరస్ పోరాటం చేసేందుకు వాక్సిన్ తోడ్పడుతూ ఉంటుంది . అయితే ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాక్సిన్ వేసినప్పటికీ వైరస్ బారిన పడితే త్వరగా కోలుకునేందుకు ఆస్కారం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ పూర్తిగా  వైరస్ ను నివారించే మందు వస్తే  బాగుండు అని అందరూ కోరుకుంటున్నారు అని చెప్పాలి.



 అయితే హిమాలయాల్లో కరోనా వైరస్ కు చెక్ పెట్టే మొక్కలు ఉన్నాయి అంటూ ఐఐటీ మండి, ఐసిజిఎంబి లు గుర్తించినట్లు తెలుస్తోంది. కేవలం హిమాలయాల్లో మాత్రమే పెరిగే రోడో డెండ్రాన్ ఆర్బోరియం అనే మొక్కలు కరోనా వైరస్ ను ఎదుర్కొనే శక్తిని కలిగి ఉన్నాయని ప్రస్తుతం కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారట. ఈ మొక్కలోని పూరేకులు ఫైటోకెమికల్స్ ఉన్నాయని ఇక వీటిలో  వైరస్ ని ఎదుర్కొనే శక్తి ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోడో డెండ్రాన్ ఆర్బోరియం అని శాస్త్రీయ నామం కలిగిన మొక్కను స్థానికంగా బురాన్ష్ పిలుస్తారట. అయితే ఇక ఈ మొక్క యొక్క పురేకులలు స్థానికులు కూడా ఎన్నో ఔషధ  తయారీలో ఉపయోగిస్తారట. వ్యాక్సిన్ కాకుండా ఆయుర్వేదికంగా వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు పరిశోధనలు జరుపుతున్న శాస్త్రవేత్తలు ఇక ఈ మొక్కను కనుగొన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: