కోల్ క‌తా దారుల నుంచి రిప‌బ్లిక్ డే కోసం ప‌రుగు ప‌రుగున వ‌చ్చిన శ‌క‌టాన్ని కాద‌ని తిప్పిపంపారు మోడీ.తీరా గొడ‌వ‌కు వెళ్లిన మమ‌త‌కు ఇలాంటి నిర్ణ‌యాల్లో త‌న ప్ర‌మేయం ఏమీ ఉండ‌ద‌ని చెప్పి పంపారు మోడీ.ఆ తిప్పి పంపడం..ఈ చెప్పి పంప‌డం వెర‌సి కొత్త వివాదాలు నెలకొనేందుకు కార‌ణం అవ్వ‌గా ఇదే బాట‌లో త‌మిళ‌నాడు,కేర‌ళ కూడా ఉన్నాయి.అవి కూడా త‌మ శ‌క‌టాలు తిప్పి పంప‌డం ఓ అవ‌మాన‌క‌ర చ‌ర్య‌గానే భావిస్తున్నాయ‌ని ప్ర‌ధాన మీడియా చెబుతోంది.అంటే కేంద్రంపై మమ‌త, స్టాలిన్, పిన‌ర‌యి విజ‌యన్ తిరుగుబాటు చేయ‌డం త‌ప్ప‌ద‌నే  సంకేతాలు ఇవాళ సుస్ప‌ష్టం. ఈ వివాదంపై కాంగ్రెస్ మాత్రం స్పందించ‌లేదు.


మోడీ చెప్పే మాట‌లు,చేసే ప‌నులు రెండూ వేర్వేరుగా ఉంటాయి.అవ‌న్నీ ఒకే విధంగా ఉండ‌వు గాక ఉండ‌వు.ఉండాల‌ని అనుకోవ‌డం కూడా విడ్డూరం.గ‌ణ‌తంత్ర వేడుక‌ల‌కు సంబంధించి మోడీ ఎంతో స‌గ‌ర్వ రీతిలో చెబుతున్న మాట‌లు కొన్ని నేతాజీని ఉద్దేశించి ఉన్నాయి.బోస్ సేవ‌ల‌ను తాము మాత్ర‌మే స్మ‌రిస్తున్నామ‌ని ఇత‌ర పార్టీల‌కు అంత సీన్ లేనేలేద‌ని కూడా అంటున్నారు మోడీ.అందుకే ఈ ఏడాది గ‌ణ‌తంత్రం ప్ర‌త్యేక రీతిలో ఉండ‌నుంద‌ని కూడా చెప్పుకుంటున్నారు.ఇవ‌న్నీబాగానే ఉన్నా అదే నేతాజీ మూలాలున్న బెంగాలీలుపంపిన శ‌క‌టంను ఎందుకు వెన‌క్కు పంపారు అంటే అందుకు త‌మ ప్ర‌మేయం ఏమీ ఉండ‌ద‌ని మాత్రం కేంద్రం స్ప‌ష్టం చేస్తూ,గ‌ణ‌తంత్ర వేడుక‌లు మొద‌లు కాక‌మునుపే కొత్త  పొలిటిక‌ల్ ట్విస్ట్ ఒక‌టి రివీల్ చేశారు.



గ‌ణ‌తంత్ర దినోత్సవ వేడుక‌లు ఈ నెల 24 నుంచే మొద‌లుకానున్నాయి.నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ 125వ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ఈ ఏడాది అత్యంత వైభవంగా మూడు రోజుల పాటు దేశ రాజ‌ధానిలో వేడుక‌లు నిర్వ‌హించేందుకు మోడీ స‌మాయత్తం అవుతున్నారు.ఈ నేప‌థ్యంలో ఓ ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటుచేసుకుంది.ఆ ప‌రిణామ‌మే వివాదాల‌కు తావిస్తోంది. మోడీ హ‌యాంలో జ‌రుగుతున్న ఈ గ‌ణ‌తంత్ర వేడుక‌ల‌కు సంబంధించి ప‌శ్చిమ బెంగాల్ నుంచి వ‌చ్చిన శ‌క‌టం ఒక‌టి తిర‌స్క‌ర‌ణ‌కు గురైంది.అది కూడా నేతాజీ స్ఫూర్తితో ఆయ‌న జీవిత కాల విశేషాలు మ‌రోమారు అంతా గుర్తు చేసుకునేవిధంగా శ‌క‌టం రూపొందించిప‌జేసిన సీఎం మ‌మ‌తా బెన‌ర్జీకి ఝ‌ల‌క్ త‌గిలింది.దీంతో వివాదం కాస్త పెరిగి పెద్ద‌ద‌వుతోంది.ఉద్దేశ‌పూర్వ‌కంగానే మోడీ త‌మ శ‌క‌టం వెన‌క్కు పంపార‌ని మండిప‌డుతున్నారు. దీంతో ర‌గ‌డ మ‌రింత పెద్ద‌ది కానుంద‌ని కూడా ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: