మీకు న‌చ్చిన విధంగా మీరు
మేం మెచ్చిన విధంగా మేము
ఉండ‌డంతో ఆత్మ వ‌చ్చి
ఏం మాట్లాడిందో కూడా
తెలియ‌క‌పోవ‌చ్చు కానీ మాట్లాడ‌డం మాత్రం నిజం కావొచ్చు
అవునా ఆత్మ‌లు మాట్లాడ‌తాయా?


దేహానికీ,ఆత్మ‌కు మ‌ధ్య కొట్లాట ఏమ‌యినా ఉందా అని సందేహం. వెళ్లిపోయిన ఆత్మ‌లు క్షోభిస్తాయా..ఆత్మ అన్న‌ది తేజ సంబంధం అని అంటారు..కొన్ని సార్లు ఆత్మ జ్ఞాన సంబంధం అని అంటారు. ఆ విధంగా ఆత్మ ఎక్క‌డో ఎవ్వ‌రినో ఎవ్వ‌రితోనో మాట్లాడింద‌ని,మాట్లాడుతూనే ఉంటుంద‌ని అనుకోవ‌డం త‌ప్పు కాదు కానీ అంత‌కుమించిన న‌మ్మ‌కాలు కొన్ని జ‌నాల‌లో ఉన్నాయి.వాటిని విశ్వాసాల‌కు అతీతంగా న‌మ్మ‌కాల‌కు అతీతంగా చూడాలి.

ఆ విధంగా ఆత్మ‌లు మాట్లాడ‌డం తెలుగు జాతి ఉన్న‌తిని కోరుకుని మాట్లాడ‌డం పాతికేళ్లు త‌రువాత ఓ మ‌నిషి చ‌నిపోయిన పాతికేళ్ల త‌రువాత విన‌డంతో అర్థం క‌న్నా ఆనందం క‌న్నా విషాద‌మే మాలో నిండి ఉంది. ఇంత‌కాలం ఈ ర‌హ‌స్యం దాచుకున్న ప్ర‌తి ఒక్క తెలుగు వాడికీ  ఎల్పీ త‌రఫున క్ష‌మాప‌ణ‌లు.ఎందుకంటే ఎన్టీఆర్ ఆత్మ ఒక్క ఆమెతోనే కాదు నాతోనూ మీతోనూ అంద‌రితోనూ మాట్లాడ‌గ‌ల‌దు. ఆ విధంగా ఆ ఆత్మ అంద‌రికీ సుప‌రిచితం క‌దా! న‌వ్వుకోకండి..మ‌న నాయ‌కులు ఏం చెప్పినా ఇలానే ఉంటాయి. అలా అని త‌ప్పుడు ప‌దాలు కావు.వారి  న‌మ్మ‌కాల‌కు విశ్లేష‌ణ ఇస్తూ రాయ‌డం క‌న్నా నిశ్శ‌బ్ద రూపాన ఉండిపోవ‌డం మేలు.

ఎన్టీఆర్ ఆత్మ త‌న‌తో మాట్లాడింద‌ని చెబుతున్నారు ఆయ‌న జీవ‌న స‌హ‌చ‌రి, తెలుగు అకాడ‌మీ ప్ర‌స్తుత చైర్ ప‌ర్స‌న్ ల‌క్ష్మీ పార్వ‌తి.
వాస్త‌వానికి సాధ్య‌మో కాదో కానీ ఎన్టీఆర్ ఆత్మతో మాట్లాడేందుకు తానెంత‌గానో ప‌రిత‌పించానని చెప్ప‌డ‌మే హాస్యాస్ప‌దం. చెన్న‌య్ దారుల్లో ఓ 16 ఏళ్ల అమ్మాయిలో ఎన్టీఆర్ ఆత్మ ప్ర‌వేశించిన త‌రువాత త‌న‌తో మాట్లాడింద‌ని చెప్ప‌డం ఇంకా హాస్యాస్పదం.ఎవ‌రి న‌మ్మ‌కాలు వారివి క‌నుక మ‌నం ఇప్పుడేం మాట్లాడ‌లేం.న‌మ్మ‌కాలు రుజువులో లేనంత వ‌ర‌కూ అసలు ఎవ‌రి వాదానికి కూడా తిరుగు అన్న‌ది ఉండ‌దు గాక ఉండ‌దు. ఆ విధంగా ఎన్టీఆర్ ఆత్మ మ‌న‌లోనే ఉంది.మ‌న‌తోనే ఉంది. ఆ మాట‌కు వ‌స్తే ఈ లోకంలోకి వ‌చ్చి గొప్ప‌గా బ‌తికి వెళ్లిపోయిన వారందరి ఆత్మ‌లూ మ‌న‌తోనే ఉంటాయి.ఆత్మలు ఎక్క‌డికీ పోవు.దేహం అశాశ్వ‌తం ఆత్మ శాశ్వ‌తం దీనికి ఓ ప్ర‌త్యామ్నాయం లేదు అని చెబుతుంటారా వైదికులు క‌నుక ఆ విధంగా ఎల్పీ  చెప్పిన మాట‌లు మ‌రియు నేను చెప్పే మాట‌లు మీరు న‌మ్మండి ఏం కాదు. వివాదం ఉన్నా వింత‌డం ఉన్నా కోర్టే అంద‌రి లెక్క‌లూ తీరుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: