టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు...చాలాకాలం నుంచి తన వారసుడు చింతకాయల విజయ్‌కు సీటు ఇప్పించుకోవాలని ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల ముందు నుంచే సీటు కోసం అయ్యన్న ప్రయత్నిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే తన వారసుడుని రెడీ చేస్తున్నారు. అటు విజయ్ సైతం దూకుడుగానే పనిచేస్తూ, పార్టీ కోసం నిలబడుతున్నారు. అయితే గత ఎన్నికల్లోనే అయ్యన్న...తన వారసుడు కోసం సీటు ట్రై చేశారు.

కానీ చంద్రబాబు మాత్రం అయ్యన్న వారసుడుకు సీటు ఇవ్వలేదు. దీంతో అయ్యన్న మాత్రమే నర్సీపట్నంలో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో అయ్యన్న ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఓడిపోయినా సరే టీడీపీ తరుపున బలమైన వాయిస్ వినిపిస్తూనే వస్తున్నారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా విశాఖలో ఏ టీడీపీ నేత నోరు విప్పకపోయిన అయ్యన్న మాత్రం గళం విప్పారు..అమరావతికి మద్ధతు తెలిపారు.

ఇలా ముందు నుంచి అయ్యన్న పార్టీలో దూకుడుగా ఉంటూనే వస్తున్నారు..అదే సమయంలో అయ్యన్న వారసుడు విజయ్ సైతం చాలా యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సారి ఎలాగైనా తన వారసుడుకు మాత్రం సీటు దక్కించుకోవాలనే పట్టుదలతో అయ్యన్న ఉన్నారు..పైగా తన వారసుడుని ఎంపీగా నిలబెట్టాలనేది అయ్యన్న కోరిక. విజయ్‌కు ఎమ్మెల్యే సీటు కంటే, ఎంపీ సీటు బాగా సూట్ అవుతుందని అయ్యన్న పలు సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చారు.

అయితే అయ్యన్న కోరుకున్నట్లుగానే తన వారసుడుకు ఎంపీ సీటు దక్కేలా ఉంది. విశాఖలో కీలకంగా ఉన్న అనకాపల్లి ఎంపీ సీటు విజయ్‌కే దక్కేలా ఉంది. ప్రస్తుతానికి అక్కడ టీడీపీకి నాయకుడు లేరు. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నుంచి ఆడారి ఆనంద్ పోటీ చేసి ఓడిపోయి ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లారు....దీంతో అనకాపల్లిలో టీడీపీకి నాయకుడు లేరు. ఆ సీటు ఇప్పుడు అయ్యన్న వారసుడుతో రీప్లేస్ చేయడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: