ఏపీలో ఉన్న 25 మంత్రులకు పనితీరు పరంగా మంచి మార్కులే పడుతున్నాయా? జగన్ క్యాబినెట్‌లో ఉన్న అందరు మంత్రులు...తమ తమ నియోజకవర్గాల్లో తిరుగులేని బలంతో ఉన్నారా? అంటే అబ్బే చాలామందికి మంచి మార్కులే పడటం లేదని చెప్పొచ్చు. సీఎం జగన్ పట్ల జనం పాజిటివ్‌గానే ఉన్నారు గాని...మంత్రులు పట్ల మాత్రం పెద్ద పాజిటివ్‌గా లేరని చెప్పొచ్చు. ఏదో పైకి చెప్పకపోవచ్చు గాని...మంత్రులపై నెగిటివ్ ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. అసలు పనితీరుకు మంచి మార్కులు అంటే....ఎంతమంది తమ శాఖలకు సంబంధించి అద్భుతంగా పనిచేస్తున్నారని చెప్పడానికి పెద్దగా లేదు. ఏదో తక్కువ మంది మాత్రమే తమ శాఖల పరంగా పనిచేస్తూ మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు.

మిగతా మంత్రుల పరిస్తితి గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. అలాగే కాస్త చెప్పడానికి ఇబ్బంది అయినా సరే...కొందరు మంత్రులు అనే సంగతి జనాలకు కూడా సరిగ్గా తెలియదని చెప్పొచ్చు. ఏదో కొడాలి నాని, పేర్ని నాని లాంటి వారు ఎక్కువ మీడియాలో కనిపించడం, ప్రతిపక్షాలపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతారు...కాబట్టి వారు జనాలకు బాగా తెలుస్తున్నారు. కొందరు మంత్రులైతే మీడియాలో కూడా కనిపించరు. ఇంకా అలాంటి మంత్రులు జనాలకు తెలియడం కష్టమే. ఏదో కాస్త రాజకీయాలు తెలిసినవారికి మంత్రులు ఎవరనేది తెలుస్తుంది గాని... మిగతా వారికి పెద్దగా తెలియడం లేదు. అలాగే కొందరు మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లో కూడా రాజకీయంగా వీక్ అవుతున్నారు.

అయితే ఇప్పటికీ తమ తమ నియోజకవర్గాల్లో బలంగా ఉన్న మంత్రుల్లో ఉత్తరాంధ్రకు సంబంధించి బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్‌లు ఉన్నారని చెప్పొచ్చు. చీపురుపల్లిలో బొత్సని ఢీకొట్టే బలమైన ప్రత్యర్ధి లేరు. ఆయనని ఓడించడం కష్టమైన పని. అటు నరసన్నపేటలో కృష్ణదాస్‌కు తిరుగులేదు. ఇక భీమిలిలో అవంతి శ్రీనివాస్, కురుపాంలో పుష్పశ్రీ వాణి, పలాసలో అప్పలరాజుల పరిస్తితి అంత ఆశాజనకంగా లేదనే చెప్పొచ్చు. మొత్తానికైతే ఉత్తరాంధ్రలో బొత్స, ధర్మానలు తోపులే.  


మరింత సమాచారం తెలుసుకోండి: