కొన్నాళ్లుగా రష్యా నుంచి ఏఎస్-400 రక్షణ వ్యవస్థలను కొనేసినందుకు భారత్ పట్ల గుర్రుగా ఉంది అగ్రరాజ్యం అమెరికా. గతంలో ఇదే పని చేసిన టర్కీపై కాస్త ఆంక్షలు విధించింది. చివరకు మన పైన కూడా ఆంక్షలు తప్పవని అంతా అనుకున్నారు. ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్న చైనాతో అమెరికా అన్ని రకాల వ్యూహాలతో పోరాటం చేస్తోంది. దాంతో మనకు సరిహద్దు దేశంగా ఉన్న చైనాను ఎదుర్కునేందుకు భారత్ మిత్ర దేశంగా వ్యవ హరిస్తోంది.

 చైనాను నిలువరించాలంటే భారత్ సహా యం తప్పనిసరైన స్థితి ఏర్ప డింది. గతంలో టర్కీపై వెంటనే ఆంక్షలు విధించిన అమెరికా భారత దేశం విషయంలో తన దూకుడు తగ్గించుకున్నట్లే కనిపిస్తోంది. రష్యా తయారుచేసిన అత్యాధునిక ఏఎస్-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ ను భారత్ కొనుగోలు చేయడంపై పూర్తిగా వెనకడుగు వేసి భారత్ పై తీసుకోలేమని బాహా టంగా చెప్పేసింది. అమెరికన్ కాంగ్రెస్ సభ్యులకు బైడెన్ ప్రభుత్వం ప్రతినిధి ఇచ్చిన సమాధానంలో భారత్ పై ఆంక్షల విషయంలో క్లారిటీ వచ్చేసింది. రష్యా నుంచి ఏఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయరాదని భారత్ ను వారిస్తున్నప్పటికీ ఆంక్షల విధింపు మాత్రం ఉండబోదని అమెరికా పేర్కొంది.

రష్యా నుంచి ఆయు ధాలను కొనుగోలు చేసే దేశా లపై కఠిన ఆంక్షలు విధించేలా అమెరికా ఓ చట్టం తెచ్చింది. భారత్ పై ఆంక్షలు తప్పవని మొదట సంకేతాలిచ్చిన వ్యూహాత్మక  కోణంలో ఇండియాకు మినహా యింపులు ఇవ్వక తప్పని పరిస్థి తిలో ఉందని అమె రికా చెప్పింది. అమెరికా మిత్ర దేశమైన సౌదీ అరేబియా లాంటి దేశాలు సైతం ఏఎస్-400 వ్యవస్థ కొనుగోలుకు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పుడు మారిన పరిస్థి తుల్లో అమెరికా తన విధానాలను తనకు అను గుణంగా మార్చుకుంటోంది. అంతే కాదు మన దేశ దౌత్యాధి కారుల విజయవంతమైన వ్యూహాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: