ఏదేమైనా చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో రెడ్డి సామాజికవర్గం హవా ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి. ఇక్కడ రెడ్డి నేతల డామినేషన్ బాగా ఎక్కువ. అందుకే ఇక్కడ వైసీపీ హవా ఎక్కువ. ఎందుకంటే రెడ్డి వర్గం వైసీపీకే ఎక్కువ మద్ధతు ఇస్తుందనే సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే గత ఎన్నికల్లో చిత్తూరులో వైసీపీ దాదాపు క్లీన్‌స్వీప్ చేసినంత పనిచేసింది. ఏదో చంద్రబాబు మాత్రం కుప్పంలో గెలిచారు. ఇప్పుడు ఆ కుప్పంలో కూడా వైసీపీ పాగా వేసే దిశగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే.

వరుసపెట్టి పంచాయితీ, పరిషత్, మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీని చిత్తుగా ఓడించింది...దీంతో చంద్రబాబు అలెర్ట్ అయ్యి..కుప్పంలో వరుసపెట్టి పర్యటిస్తూ టీడీపీని లైన్‌లో పెట్టే పనిలో పడ్డారు. అయితే కుప్పంలో కూడా వైసీపీ హవా నడవటానికి కారణం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే సంగతి అందరికీ తెలిసిందే. అంటే అక్కడ కూడా రెడ్డి వర్గం హవా మొదలైంది. అందుకే కుప్పంలో టీడీపీ విజయాలకు దూరమవ్వడం మొదలైంది.

ఇదే సమయంలో నెక్స్ట్ కుప్పం బరిలో రెడ్డి వర్గం నాయకుడునే బరిలో దించుతారని ప్రచారం కూడా వస్తుంది. ఎలాగో కుప్పం ఇంచార్జ్ భరత్‌కు ఎమ్మెల్సీ ఇచ్చారు. దీంతో కుప్పం బరిలో పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన వ్యక్తి పోటీ చేస్తారని తెలిసింది. పెద్దిరెడ్డి తమ్ముడు కుమారుడు సుధీర్ రెడ్డి, నెక్స్ట్ కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. అంటే కుప్పంలో రెడ్డి వర్గం హవా ఎలా మొదలైందో అర్ధం చేసుకోవచ్చు.

అదే సమయంలో చంద్రబాబు సైతం రెడ్డి వర్గం నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. ఇంతకాలం కుప్పం బాధ్యతలని చంద్రబాబు పి‌ఏ మనోహర్, గౌరివాని శ్రీనివాసులు..ఇతర నేతలు చూసుకున్నారు. వారి వల్ల పార్టీకి చాలా డ్యామేజ్ జరిగింది. అందుకే వారిని సైడ్ చేసి, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని ముందు పెట్టాలని బాబు చూస్తున్నారని తెలిసింది. అంటే కుప్పం కూడా రెడ్డి వర్గం చేతుల్లోకి వెళుతున్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: