జానారెడ్డి...ఈ పేరు గురించి పెద్దగా పరిచయం చేయక్కరలేదు...రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. దశాబ్దాల కాలం నుంచి రాజకీయాలు చేస్తూ వస్తున్న జానారెడ్డి...తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న విషయం తెలిసిందే. మొదట్లో తెలుగుదేశంలో పనిచేసిన జానారెడ్డి, ఆ తర్వాత కాంగ్రెస్‌లోకి వచ్చి నల్గొండ జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతూ వస్తున్నారు....ఒకానొక దశలో వైఎస్సార్ చనిపోయిన తర్వాత సీఎం సీటులో జానారెడ్డి కూర్చుంటారని ప్రచారం జరిగింది. అలా సీఎం స్థాయి నేతగా ఉన్న జానారెడ్డి, ఇప్పుడు రాజకీయంగా పలు ఇబ్బందులు ఎదురుకుంటున్నారు..ఇంతకాలం ఓటములు పెద్దగా ఎరగని జానారెడ్డి, వరుసపెట్టి ఓటములని ఎదురుకుంటున్నారు.

2018లోనే కాదు...2021లో జరిగిన నాగార్జున సాగర్ ఉపఎన్నికలో సైతం ఓటమి పాలయ్యారు. ఇలా వరుసగా ఓడిపోతూ వస్తున్న జానారెడ్డి...ఇకపై పోటీ చేయనని చెప్పేసిన విషయం తెలిసిందే. మొన్న జరిగిన ఉపఎన్నికలోనే జానారెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే జానారెడ్డి పోటీ చేయకపోతే, ఆయన తనయుల్లో ఎవరోకరు బరిలో దిగే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు జానారెడ్డి తనయులు రఘువీర్, జై వీర్‌లు యాక్టివ్‌గా తిరుగుతున్నారు. అయితే ఈ మధ్య జానారెడ్డి సైతం యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. అయితే మిర్యాలగూడలో రఘువీర్ ఎక్కువ పర్యటిస్తున్నారు...నాగార్జున సాగర్‌లో మాత్రం జై వీర్ ఎక్కువ పనిచేస్తున్నారు. అయితే జానారెడ్డి గాని సైడ్ అయితే..సాగర్‌లో జై వీర్ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక టీఆర్ఎస్‌లో ఉన్న ఆధిపత్య పోరు జానారెడ్డి ఫ్యామిలీకి బాగా కలిసొస్తుంది. ఉపఎన్నికలో సెంటిమెంట్, అధికార బలంతో టీఆర్ఎస్ గెలిచింది. కానీ తర్వాత మాత్రం సీన్ మారింది...ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, టీఆర్ఎస్ నేత తేరా చిన్నపరెడ్డి వర్గాల మధ్య పోరు నడుస్తోంది. ఈ మూడు వర్గాల పోరుతో సాగర్‌లో జానారెడ్డి వారసుడుకు లైన్ క్లియర్ అయ్యేలా ఉంది. మొత్తానికి సాగర్‌లో జానారెడ్డి ఫ్యామిలీకి ఈ సారి లక్కీ ఛాన్స్ ఉండేలా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: