కృష్ణా జిల్లా అంటే టీడీపీ బలంగా ఉన్న జిల్లా అనే సంగతి తెలిసిందే...అక్కడ టీడీపీ బలం తగ్గించాలంటే చాలా కష్టపడాలి. ఎన్నో ఎత్తులు, వ్యూహాలు వేస్తే గాని రాజకీయంగా మరొక పార్టీ సక్సెస్ కాలేదు. అలాంటి ఎత్తులు, వ్యూహాలు వేసే జగన్ సక్సెస్ అయ్యారు...2019 ఎన్నికల్లో కృష్ణాలో అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే 2014లో చేసిన తప్పులని సరిదిద్దుకోవడంతోనే కృష్ణాలో వైసీపీ సక్సెస్ అయిందని చెప్పొచ్చు.

కొన్ని నియోజకవర్గాల్లో జగన్ మిస్టేక్‌లు ఎక్కువ చేశారు...సరైన అభ్యర్ధులని నిలబెట్టకపోవడం వల్ల..2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచేసింది...పైగా ఒకచోట పెట్టాల్సిన అభ్యర్ధిని మరొక చోట పెట్టడం లాంటివి చేసి ఫెయిల్ అయ్యారు. కానీ 2019 ఎన్నికల్లో ఆ తప్పులని సరిదిద్దుకున్నారు. పలుచోట్ల అభ్యర్ధులని పర్ఫెక్ట్‌గా పెట్టారు. 2014తో పోలిస్తే 2019 ఎన్నికల్లో పలుచోట్ల అభ్యర్ధులు మారారు. ఉదాహరణకు 2014లో మైలవరంలో పోటీ చేసి ఓడిపోయిన జోగి రమేష్‌ని, 2019లో పెడనలో నిలబెట్టి గెలిచేలా చేశారు.

అటు మైలవరంలో కమ్మ నేత వసంత కృష్ణప్రసాద్‌ని నిలబెట్టి సక్సెస్ అయ్యారు. ఇటు విజయవాడ సెంట్రల్‌లో గౌతమ్ రెడ్డిని సైడ్ చేసి మల్లాది విష్ణుని నిలబెట్టి విజయం సాధించారు. అలాగే కైకలూరులో దూలం నాగేశ్వరరావుని, పామర్రులో అనిల్ కుమార్, విజయవాడ వెస్ట్‌లో వెల్లంపల్లి శ్రీనివాస్, పెనమలూరులో పార్థసారథిలని 2019 ఎన్నికల్లో నిలబెట్టి సక్సెస్ అయ్యేలా చేశారు..వీరంతా 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి వేరే నియోజకవర్గాల్లో పోటీ చేయడం...లేదా వేరే పార్టీల్లో పోటీ చేసి ఓడిపోయిన నాయకులే.

అంటే 2014లో ఉన్న పోలిటికల్ సీన్‌ని 2019 ఎన్నికల్లో మార్చేసి జగన్ సక్సెస్ అయ్యారు. కృష్ణా జిల్లాలో విజయం సాధించారు. మరి 2024 ఎన్నికల్లో కూడా కృష్ణాలో కొన్ని మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందని సమాచారం. చూడాలి మరి ఈ సారి కృష్ణా జిల్లాలో ఏ వైసీపీ ఎమ్మెల్యే సీటు మారుతుందో?  

మరింత సమాచారం తెలుసుకోండి: